Read more!

English | Telugu

ఇవ్వాళ రాజకీయాలు ఎలా ఉన్నాయి అంటే...


ఆలీతో సరదాగా సీజన్ 2 ప్రతీ వారం ఎంటర్టైనింగ్ గా సాగిపోతోంది. ఈ వారం షోకి సీనియర్ నటుడు మురళి మోహన్ ని అలాగే కోడలు మాగంటి రూపాను తీసుకొచ్చారు. ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు పూర్తైన సందర్భంగా మురళి మోహన్ కి కంగ్రాట్స్ చెప్పారు ఆలీ. శంకరాభరణం సినిమాను 100 సార్లు చూసాను అని మాగంటి రూపా చెప్పేసరికి అదా విషయం ఏమిటా ఈ మూవీకి ఇన్ని కలెక్షన్స్ ఎలా వచ్చాయా అనుకున్నాను అంటూ ఆలీ సెటైర్ వేశారు.

ఇక తాను బురదలో ఆడుకుంటున్నప్పుడు చూసిన తన  అత్తగారు కోడల్ని చేసుకుంటే ఎంత బాగుంటుంది అనుకున్నారట అలాగే ఈ అమ్మాయి చాలా ఎఫిషియెంట్ గా ఉంది మన కోడలైతే ఎంత బాగుంటుంది అని మురళి మోహన్ కూడా అనుకున్నారట అలా రూపాను ఇంటికి కోడలిగా తెచ్చుకున్నాం అని చెప్పారు. తాను చిన్నప్పుడే పొలిటిషన్ అవుతానని ఇంట్లో చెప్పేవారట రూపా. తన సెకండ్ సిస్టర్ మెడికల్ ప్రొఫెషన్ లో ఉన్నారట..థర్డ్ సిస్టర్ ఫిలిం ఇండస్ట్రీలో ఉంటానని చెప్పారట. ఇక ఆలీ ఒక ప్లేట్ లో టమాటో, నిమ్మకాయ చూపించి ఈ రోజు నుంచి ఇవి తినడం మానేయాలి అనేసరికి తినొద్దంటే ఎట్లా కానీ ఆలీకి ఇచ్చిన మాట కాబట్టి పర్లేదులే అని చెప్పారు మురళి మోహన్. ఐతే ఈరోజున రాజకీయాలు సరిగా లేవనే విషయాన్నీ రూప ప్రోమో చివరిలో చెప్పారు. మరి ఇంతకు ఆమె ఎలాంటి విషయాలు చెప్పారో తెలియాలంటే ఈ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.   ఆయన   నటుడిగానే కాకుండా.. నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా, వ్యాపారవేత్తగా, రియల్టర్ గా గుర్తింపు తెచ్చకున్నారు.  ఆయన 350కి పైగా సినిమాల్లో నటించారు. ఇక మురళీ మోహన్ జయభేరి సంస్థ ద్వారా 20 సినిమాలు నిర్మించారు.  1978లో ఆయన రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు.