Read more!

English | Telugu

నేనేం నీ అగ్రిమెంట్ భార్యని కాదు కదా మురారి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-90 లో.. ఇంట్లో ఎవరు నా మాట  వినట్లేదని, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేస్తున్నారని భవాని అంటుంది. రేవతి నువ్వు కృష్ణని కూడా వాళ్ళిద్దరితో పాటుగా ఢిల్లీకి పంపిద్దామని అనుకుంటున్నట్టు నాకొక మాటైనా చెప్పొచ్చు కదా అని భవాని అడుగగా.. నీకు చెప్పకపోవడం తప్పే అక్క అని రేవతి అంటుంది. మురారి నువ్వు అయినా నాకు టికెట్ బుక్ చేసే ముందు చెప్పాలి కదా అని భవాని అనగానే.. "పెద్దమ్మ అమ్మ టికెట్ బుక్ చెయ్యమంటేనే చేశాను" అని మురారి చెప్తాడు. కృష్ణ నిన్న కాక మొన్న వచ్చి.. ఆదర్శ్ రావాలని కోరుకుంటుంది. కానీ ముకుంద మాత్రం ఎందుకు అలా ఆలోచిస్తుందో నాకు అర్ధం కావడం లేదని మురారి అనేలోపే.. ముకుంద అక్కడకి వస్తుంది. వీళ్ళందరు కలిసి పెద్ద అత్తయ్య ముందు నన్ను బ్యాడ్ చేసేలా ఉన్నారని రేవతి దగ్గరికి వెళ్లి అత్తయ్య నన్ను క్షమించండి.. పెద్ద అత్తయ్య మీరు కూడా నన్ను క్షమించండి.. నేను ఏదో బాధలో అలా అనేశాను అని నటిస్తుంది. ఇంకా మురారికి నామీద కోపం తగ్గినట్లు ఉందని ముకుంద తన మనసులో అనుకుంటుంది. ఇక మళ్ళీ ఢిల్లీకి ఎప్పుడు రమ్మన్నారు ముకుందా? అని భవాని అడుగుతుంది.. వాళ్ళు కాల్ చేసి చెప్తామని చెప్పారు అత్తయ్య అని ముకుంద అంటుంది. ఈ సారి ఢిల్లీకి వెళ్తే నువ్వు ఒక్కదానివే వెళ్ళని భవాని చెప్పడంతో ముకుంద షాక్ అవుతుంది. రేవతి మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతుంది.

ఆ తర్వాత ముకుంద, మురారి కోసం ఎదురుచూస్తుంటుంది. ఉదయం వెళ్ళాడు ఇంకా రావట్లేదని అనుకునే లోపే మురారి వస్తాడు. మురారి ఎక్కడికెళ్ళావ్? నీకోసం ఎదురు చూస్తున్నా అని ముకుంద అంటుంది. ఎదురు చూడడం దేనికి బయటికి వెళ్ళినవాడిని మళ్ళీ ఇంటికే వస్తానుగా అని అంటాడు మురారి. అందరి ముందు మాట్లాడడానికి నేనేం నీ అగ్రిమెంట్ భార్యని కాదు కదా మురారి.. అందుకే ఇలా మాట్లాడుతానని ముకుంద అనగానే.. "ప్రతీసారి అగ్రిమెంట్ అని గుర్తుచేయకు.. ఎవరైనా వింటారు" అని మురారి అనడంతో.. వింటే ఏంటి ఎప్పుడైనా తెలిసేదే కదా అని ముకుంద అంటుంది. చెప్పాల్సిన పరిస్థితి వస్తే మేమే చెప్తామని చెప్పేసి వెళ్ళిపోతాడు మురారి. 

మరోవైపు కృష్ణకి సర్ ప్రైజ్  ప్లాన్ చేస్తాడు మురారి. తనకి ఫోన్ చేసి ముందువైపు చూడు అని చెప్పడంతో.. కృష్ణ ముందువైపు చూడగా.. తనకి ఇష్టమైన డాక్టర్ డ్రెస్, స్టెతస్కోప్ పట్టుకొని మురారి ఎదురుగా నిలబడతాడు. అది చూసి  కృష్ణ చాలా సంతోషపడుతుంది. ఆ తర్వాత కాసేపటికి కాలేజీకి రెడీ అవ్వు.. లేట్ అవుతుందని మురారి అనడంతో.. కృష్ణ కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతుంది. మురారి దగ్గరికి కాఫీ తీసుకొని వస్తుంది ముకుంద. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.