Read more!

English | Telugu

నా కూతురినే వదిలించుకున్నాను.. ఆ తింగరి పిల్ల ఓ లెక్కా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -144 లో.. కృష్ణతో రేవతి మాట్లాడిందని గొడవ చేస్తుంది భవాని. ఇంకెప్పుడు ఇంట్లో ఎవరితో మాట్లాడకని కృష్ణకి చెప్తుంది భవాని. చూడండి అత్తయ్య.. మీరు కూడా నాతో మాట్లాడారని కృష్ణ అనగానే.. భవాని  కోపంగా చూసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రేవతి, కృష్ణ ఇద్దరు సరదాగా నవ్వుకుంటారు. అది చూసిన మురారి.. ఇదేంటి కృష్ణని పెద్దమ్మ ఇంత లైట్ తీసుకుంటుందని భయపడతాడు. 

మరొకవైపు అందరూ భోజనానికి వస్తుండగా.. వాళ్ళ కంటే ముందు వెళ్దామని మురారితో కృష్ణ అంటుంది‌. ఏసీపీ సార్ రండి భోజనం చేద్దాం.. మీకోసం స్పెషల్ గా చపాతి చేశానని అంటుంది. ఇంతలోనే మీరు ఆగండని ఇంట్లో వాళ్ళని ఆగమంటుంది భవాని. మరొకవైపు కిచెన్ లో వంట చేస్తున్న రేవతి దగ్గరికి ముకుంద వస్తుంది. ఈ కృష్ణ ఉప్పు కారం ఎక్కడ పెట్టిందో.. ఇప్పుడు ఎలా అడగాలని రేవతి అనగానే.. నేను వెళ్లి కనుక్కొని వస్తానని ముకుంద కృష్ణ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఒక పేపర్ పై ఉప్పు కారం ఎక్కడ ఉందని ముకుంద రాసి అడుగుతుంది. కృష్ణ అక్కడ పైన పెట్టిన అంటూ రేవతికి చెప్తుంది. నువ్వు కూడ పేపర్ పై రాయొచ్చు కదా కృష్ణ అని ముకుంద అంటుంది. అదంతా భవాని దూరం నుంచి చూస్తుంది. ఆ తర్వాత భవాని లోపలికి వెళ్ళిపోతుంది. కాసేపటికి భవాని దగ్గరికి ఈశ్వర్ వెళ్తాడు. ఈ తింగరి పిల్లతో వేగడం కష్టంగా ఉంది ఈశ్వర్.. నా కూతురినే వద్దనుకున్న దాన్ని.. నాకు ఆ పిల్ల ఒక లెక్క అని భవాని అనగానే.. మరి మురారి అని ఈశ్వర్ అంటాడు. అప్పుడే కృష్ణ ఎంట్రీ ఇస్తుంది. ఎలా పోతే ఏంటి అని కృష్ణ అనగానే ఇద్దరు కోపంగా కృష్ణ వైపు చూస్తారు. కృష్ణ మాత్రం అక్కడున్న కృష్ణుని ఫోటో దగ్గరికి వెళ్లి పోతుంది. ఎవరు ఏమైపోతే ఏంటి గోకులం విడిచి రాలేరు. పేరుకు పెంచిన తల్లి కానీ పవర్ ఫుల్. వెన్నె తిన్న కోపమే మన్ను తిన్న కోపమే.. రోటికి కట్టేస్తారు మాటలతో కట్టిపారేస్తారు.. మీ వొడిలో పెరిగిన బాలకృష్ణుడే కదా.. కాస్తంత కనికరం చూపించొచ్చు కాదమ్మా యశోదమ్మ అని భవానిని ఉద్దేశించి కృష్ణ అంటుంది. గోకులంలో ఉన్న నువ్వు.. ద్వారకలో కన్నతల్లి.. ఎవరు మాట్లాడకపోతే మోము వాడిపోయి బృందావనంలో  కూర్చున్న కృష్ణుడిని చూడండి.. పాపం కదు అమ్మ.. అన్నం పెట్టడం లేదు పెద్దమ్మ.. క్షమాభిక్ష పెట్టడం లేదు.. మీరు ఇలా చేస్తే ఎలా అంటూ కృష్ణ ఏడుస్తూ వెళ్ళిపోతుంది. అదంతా వింటున్న రేవతి కూడా ఎమోషనల్ అవుతుంది.

ఆ తర్వాత మురారి, కృష్ణలు సరదాగా మాట్లాడుకుంటారు. నా కూతురు ఇలా చేస్తే నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని కృష్ణ అంటుంది. నేను కూడా అలానే చేస్తాను నీ మాటనే వింటాను కదా అని మురారి అనగానే.. ఏంటి మనం పర్మినెంట్ భార్య భర్తలలాగా మాట్లాడుకుంటున్నామని కృష్ణ అంటుంది. సరే కృష్ణ కాసేపు పర్మినెంట్ భార్య భర్తలాగా మాట్లాడుకుందామని మురారి అనగానే.. సరే అంటుంది కృష్ణ. మురారి తాగేసి వచ్చిన ఆటో డ్రైవర్ లాగా, కృష్ణ గయ్యాళి భార్యలాగా ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు. ఆ సీన్ ఫన్నీ గా అనిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.