Read more!

English | Telugu

కృష్ణకి గన్ పెట్టిన భవాని..!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -141లో... కృష్ణ,మురారితో ఇంట్లో ఎవరు మాట్లాడొద్దని భవాని అందరికి చెప్తుంది. మరోవైపు నందుని పెళ్లి  చేసుకున్న గౌతమ్.. నందుని తన వెంట తీసుకొని వెళ్తాడు. నందు మాత్రం అన్నం తినకుండా కృష్ణ కావాలని మారాం చేస్తుంది. పాపం కృష్ణని ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారో ఏమో అని నందు అనగానే.. గౌతమ్ కృష్ణ గురించే ఆలోచిస్తుంటాడు. కృష్ణ మనల్ని కలపడానికి కష్టపడింది.. ఇప్పుడు ఆ ఇంట్లో తన పరిస్థితి ఎలా ఉందోనని గౌతమ్ మనసులో అనుకుంటాడు.

మరొకవైపు భవాని తన గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఆదర్శ్ ఇంట్లో నుండి వెళ్ళిపోయినది, నందు గౌతమ్ ని పెళ్లి చేసుకోవడం.. ఇంకా మురారి తనకు నమ్మక ద్రోహం చేసాడని.. అవన్నీ  గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది భవాని. ఆ తర్వాత కృష్ణ తన గదిలోకి వెళ్ళగా.. అక్కడ మురారి ఒంటరిగా కూర్చుని బాధపడడం చూసి.. నావల్ల మీకు, మీ పెద్దమ్మకి గొడవ అయింది.. మిమ్మల్ని, మీ పెద్దమ్మని నేను కలుపుతానని కృష్ణ అనుకుని భవాని గది దగ్గరికి వెళ్తుంది. డోర్ కొట్టి పిలుస్తుంది. భవానీ డోర్ తీయగా.. కాసేపు సైలైంట్ గా ఉంటుంది కృష్ణ. ఆ తర్వాత కృష్ణ ఏమీ మాట్లాడకపోయేసరికి.. భవాని డోర్ మూసేస్తుండగా తనని ఆపి మాట్లాడుతుంది. పెద్ద అత్తయ్య.. మీరు మీ అబ్బాయిని క్షమించండని అనగానే.. భవాని కోపంతో ముకుంద అని గట్టిగా అరుస్తుంది. అలా గట్టిగా అరిచేసరికి అందరూ హాల్లోకి వస్తారు. అందరూ హాల్లోకి వచ్చి చూసేసరికి.. కృష్ణ తలపై భవాని గన్ పెట్టి ఉంటుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. మిమ్మల్ని ఎదిరిస్తే.. ఒక మనిషి ప్రాణం తీస్తారా? అయినా వాళ్ళేం తప్పు చేశారు? నందుకి మంచి జీవితం ఇచ్చారు కదా అని ముకుంద అంటుంది.

నా ప్రాణం తీయాలనుకుంటే.. మీరు ఏసీపి సర్ ని క్షమిస్తానని చెప్పండి.. అలా అయితే మీరు అనుకున్నదే చెయ్యండని కృష్ణ అంటుంది. ఇక పక్కనే ఉన్న రేవతి. నా కొడుకు తప్పు చేసాడు.. నాకు శిక్ష వెయ్యండని అంటుంది. ఎవరేది చెప్పినా వినకుండా భవాని గన్  ట్రిగ్గర్ పై వేలు పెడుతుంది. అప్పుడు మురారి, కృష్ణని నెట్టి గన్ ముందుకు వస్తాడు.. మా పెద్దమ్మ ఒకరిని చంపేంత కసాయిది కాదని మురారి అనగానే.. గన్ కింద పడేసి వెళ్ళిపోతుంది భవాని. అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు.ఆ తర్వాత మురారి దగ్గరికి కృష్ణ వచ్చి.. నా వల్లే ఇదంతా జరిగింది.. కానీ నందు పెళ్ళి మాత్రం గౌతమ్ తో జరిగింది.. నందుని మళ్ళీ మాములు మనిషిని చేసి గౌతమ్ మన ముందుకు తీసుకొస్తాడని అంటుంది. మా పెద్దమ్మ ఎప్పుడు ఇలానే ఉంటుందా కృష్ణ.. మా పెద్దమ్మ మనకు ఇలాగే దూరంగా ఉంటుందా అని మురారి బాధపడుతాడు. కృష్ణపై తల వాల్చి పడుకుంటాడు మురారి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.