Read more!

English | Telugu

నందుని అమెరికాకి పంపించడానికి ఏర్పాట్లు ముమ్మరం చేసిన భవాని!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -122 లో.. రేవతిని ఈశ్వర్ మా వదినకే ఎదురు మాట్లాడుతావా అని కోప్పడతాడు. ఇక రేవతి వెళ్లిపోగానే.. "ఏంటి ఈశ్వర్.. రేవతిపై అలా అరిచావు?" అని భవాని అడుగుతుంది. మరోవైపు కృష్ణ తలస్నానం చేసి సాంబ్రాణి ధూపం వేసుకుంటుంటే మురారి వచ్చి ఏమైనా హెల్ప్ కావాలా అని అడుగుతాడు. మీరేం హెల్ప్ చేస్తారని కృష్ణ అంటుంది.

నువ్వు క్షమించేవరకు నీకు హెల్ప్ చెయ్యాలి కదా అని మురారి అంటాడు. ఇంతలో రేవతి కాఫీ తీసుకొని వస్తుంది. గుడ్ మార్నింగ్ మమ్మీ అని మురారి చెప్పినా కూడా పట్టించుకోకుండా.. కృష్ణతో గుడ్ మార్నింగ్ అమ్మా అని చెప్తూ.. ఈ కాఫీ నీకే అమ్మా అని రేవతి ఇస్తుంది. ఇక నందుని ట్రీట్ మెంట్ కోసం అమెరికాకి పంపిస్తున్న విషయం కృష్ణకి రేవతి చెప్పగానే కృష్ణ షాక్ అవుతుంది. మంచిదేగా అని మురారి అంటాడు. నువ్వు నందు గురించి మీ ఏసీపీ సర్ కి చెప్పలేదా అని రేవతి అడుగుతుంది. లేదు అత్తయ్య చెప్పలేదు.. సర్ ని బయటకు తీసుకెళ్ళి చెప్తానని కృష్ణ అంటుంది. అయినా ఈ ఏసీపీ సర్ కూడా ఆ పెద్దమ్మ కొడుకే కదా అని రేవతి అంటుంది. కృష్ణ, రేవతిలు ఏం మాట్లాడుకుంటున్నారో మురారికి అసలు అర్థం కాదు.

మరోవైపు భవాని ముందు ఏదో ఫైల్ తీసుకొచ్చి పెడతాడు ఈశ్వర్. ఈ ఫైల్ ఏంటి ఈశ్వర్.. కృష్ణ చుస్తే లేనిపోని డౌట్. ఇప్పటికే రేవతి, నందుని అమెరికా పంపిస్తున్న విషయం చెప్పేసి ఉంటుంది. కానీ నందు వెళ్ళడం మాత్రం ఆగకూడదు. వీసా ఏర్పాట్లు చూడమని ఈశ్వర్ తో చెప్తుంది భవాని. మరోవైపు ముకుంద, మురారి గురించి ఆలోచిస్తుండగా.. ముకుంద దగ్గరికి అలేఖ్య వెళ్ళి.. "బావగారు బయటకు వెళ్తున్నారు.. వెళ్ళేటప్పుడు చెప్పమన్నావు కదా" అని చెప్పగానే.. అవునవను అంటూ త్వరగా ముకుంద వెళ్తుంది.

ఆ తర్వాత "కృష్ణ నాతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలి అంటుంది. నన్ను క్షమించమని అడగాలి" అని అనుకుంటాడు మురారి. ఇంతలో ముకుంద మురారి దగ్గరికి వచ్చి.. పదా వెళ్దామని అంటుంది. నేను నీకోసం కాదు, కృష్ణ కోసం ఎదురుచూస్తున్న అని మురారి అనగానే.. తనని కాలేజీ దగ్గర డ్రాప్ చేసి వెళ్దామని ముకుంద అంటుంది. ఇంతలో అక్కడికి కృష్ణ వస్తుంది. " నేను షాపింగ్ కి వెళ్ళాలి కృష్ణ.. నేను కూడా మీతో వస్తాను" అని ముకుంద అడిగేసరికి.. సరే నిన్ను షాపింగ్ దగ్గర డ్రాప్ చేసి మేం వెళ్తామని కృష్ణ చెప్తుంది. ముకుంద నువ్వు వెనకాల సీట్లో కూర్చో, కృష్ణ నువ్వు ముందు సీట్లో కూర్చోమని మురారి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.