Read more!

English | Telugu

Krishna Mukunda Murari : ప్రెగ్నెంట్ గా ఉన్న కోడలు.. కాలుకింద పెట్టనీయకుండా చూసుకుంటున్న అత్త!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -461 లో... మురారి, కృష్ణ మాట్లాడుకుంటారు. ఆ విషయం తెలిసిన వ్యక్తులలో మీరా ఒకరని గ్రహించిన మురారి తనని డైరెక్ట్ గా పిలిచి.. ఆ అమ్మాయిని రమ్మంది నువ్వే కదా అని అంటాడు. దాంతో మీరా ఒక్కసారిగా షాక్ అవుతుంది.

అలా అనగానే కాసేపు మురారీతో వాదించిన మీరా ఇక లాభం లేదని కన్నీళ్ళతో తన నటన మొదలెడుతుంది.  నాకు ఇలా కావాల్సిందే.. మీరే నన్ను అనుమానిస్తారా? మీ మంచి కోరుకునే నాకు ఇంత అవమానమా? తట్టుకోలేకపోతున్నాను.. అసలు మీకు ఏ డాక్టర్ చెప్పింది పేరెంట్స్‌తో సరోగసి మదర్ కలవదని.. ఎంతో మంది పేరెంట్స్ సరోగసి మదర్‌ని తొమ్మిది నెలల పాటు ఇంట్లోనే ఉంచి జాగ్రత్తగా చూసుకుంటారు తెలుసా మీకు? నిజంగానే ఆ అమ్మాయి అడ్రస్ మారి మన దగ్గరకు వచ్చిందంటూ లాజిక్‌గా మాట్లాడి మురారి మనసుని మార్చేస్తుంది. మీరా ఏడవడంతో మురారి కరిగిపోతాడు. మీరాకి సారీ చెప్పేసి వెళ్ళిపోతాడు. మరోవైపు రేపు మనం సరోగసి మదర్ గురించి డాక్టర్‌ని కలవాలి సరేనా అంటూ ఒప్పించగా.. దానికి కృష్ణ సరేనంటుంది  ఇంట్లో ఆసుపత్రికి వెళ్తున్నామని, రెగ్యులర్ చెకప్ అని అబద్దం చెబుదామని మురారి అనగానే.. కృష్ణ తప్పక ఒప్పుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే కృష్ణ ముగ్గు డబ్బా తీసుకుని వెళ్లబోతుంటే.. భవాని రచ్చ చేస్తుంది. కడుపుతో ఉన్న నువ్వు కాలు కదపడానికి వీల్లేదు అంటు భవాని గొడవ చేస్తుంది. ఆ ముగ్గు డబ్బా మీరాకి ఇచ్చేసి నువ్వు రెస్ట్ తీసుకోమని భవాని కోప్పడుతుంది. ఇప్పుడు చెబుతున్నాను ఇంట్లో అందరికీ.. కృష్ణతో ఏ పని చేయించొద్దు అంతే అంటూ గట్టిగా చెప్తుంది భవాని. దాంతో ముకుంద ముగ్గు వేయడానికి బయటికి వెళ్ళగా.. కృష్ణ రెస్ట్ కోసం గదిలోకి వెళ్తుంది.

సంగీత, రజినీ మాట్లాడుకుంటారు. ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నీకు బొత్తిగా భయం లేకుండా పోయిందే. ఆ మధుగాడు నిన్ను బాగా చెడగొడుతున్నాడు. లేకపోతే నా కళ్లే పోతాయి అంటావా అని అంటుంది. మంచి వాళ్ల గురించి వంకరగా మాట్లాడితే కళ్లేంటి.. కాళ్లు చేతులు కూడా వంకరపోతాయి. కృష్ణక్కకు పొగరు లేదు.. ముకుంద స్నేహితురాలంటూ వచ్చిందే మీరా. దానికి ఒళ్లంతా పొగరే అని సంగీత అంటుంది. ఒసేయ్ ఒసేయ్.. దాన్ని ఎందుకు అంటావే? అది ఆదర్శ్ బావతో నీ పెళ్లి చేస్తానని మాటిచ్చిందే అంటూ మీరా ఎక్కడ వినేసిందో అని చుట్టూ చూస్తూ కంగారుపడుతుంది రజిని. దాని మాట మీద నమ్మకం పెట్టుకున్నావా? అసలు దాని వాలకం చూశావా? ఆదర్శ్ బావతో మాట్లాడటం చూశావా? బావకు నాతో పెళ్లి చేయడం కాదు.. అది బావను పెళ్లి చేసుకోకుండా ఉంటే చాలు.. దాని మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకని అనేసి సంగీత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది. ఆ మీరా అలాంటి ఉద్దేశమే లేదు అంది కదా.. ఏమోలే ఎందుకైనా మంచిది ఒక కన్ను వేసి ఉంచాలని రజిని అనుకుంటుంది. ఇక తరువాయి భాగంలో కృష్ణకు వైదేహి కాల్ చేసి.. మనకు ఒక సరోగసి మదర్ దొరికారని అనగానే.. కృష్ణ సంతోషిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.