Read more!

English | Telugu

Krishna Mukunda Murari : సరోగసి ద్వారా మీరా తల్లి కానుందా.. ఆమె ప్లాన్ ని కృష్ణ, మురారీలు కనిపెట్టగలరా?

స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -457 లో.. మీరా ప్రయత్నం ఫలిస్తుంది. డాక్టర్ వైదేహితో కలిసి కృష్ణకు పిల్లలు పుట్టకుండా మీరా చేస్తుంది. ఈ క్రమంలోనే కృష్ణకు కూడా తనకు పిల్లలు పుట్టరన్న నిజం తెలిసి ఏడుస్తుంటే మురారీ ఓదారుస్తాడు. అయితే సరోగసికి కృష్ణను ఎలా ఒప్పించాలనుకుంటాడు. ఆసుపత్రి నుంచి ఏకాంత ప్రదేశానికి వెళ్లిన తర్వాత.. మురారీ, కృష్ణలు మాట్లాడుకోవడం చాటుగా వింటుంది మీరా. 

అదే సమయంలో పెద్దత్తయ్యకు ఇచ్చిన మాట నెరవేరాలంటే.. మనం సరోగసి ద్వారా బిడ్డను కందాం ఏసీపీ సర్.. మనకు ఒక మంచి అమ్మాయి దొరికితే చాలని కృష్ణ అంటుంది. నేను చెప్పాలనుకున్నదే కృష్ణ చెప్పడంతో మురారి హ్యాపీగా ఫీల్ అవుతాడు. డాక్టర్ మహేశ్వరిని కలుద్దామని ఇద్దరు అనుకుంటారు. మరోవైపు డాక్టర్ వైదేహి దగ్గరకు మీరా వెళ్లి స్వీట్ తినిపించి.. నా జీవితాన్ని నిలబెట్టింది నువ్వే.. థాంక్యూ అంటుంది. అలాగే.. ఇక నేను మురారీ పాపకు తల్లిని కాబోతున్నాను. ఆ బిడ్డకు నీ పేరే పెట్టుకుంటానని మీరా అంటుంది. అదేంటి త్వరలో పాపని కంటావా.. అదెలా అని వైదేహీ అడుగగా.. అది అంతే.. నా మాటల్లో అర్థాలు త్వరలోనే అర్థమవుతాయిలే అని మీరా నవ్వుతుంది. మరోవైపు డాక్టర్ మహేశ్వరిని కృష్ణ, మురారి కలుస్తారు. అప్పటికే మహేశ్వరిని మీరా లైన్‌లో పెట్టేయడంతో.. నా చేతుల్లో ఏం లేదు. సరోగసిలో స్పెషలిస్ట్ డాక్టర్ వైదేహీ గారే.. ఆమె దగ్గరకు వెళ్లండి.. తను మీకు సాయం చేస్తుందని మహేశ్వరి చెప్తుంది. దాంతో ఇద్దరు కలిసి వైదేహి దగ్గరకు వస్తారు. అదేసమయంలో డాక్టర్ వైదేహీకి మీరా ఫోన్ చేస్తుంది.

కృష్ణ, మురారీలిద్దరు నీ దగ్గరికి సరోగసి కోసం వచ్చారని, అదంతా నా ప్లానే అని వైదేహీతో మీరా మాట్లాడుతుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలని వైదేహీ అనగానే.. మీరా ఏదో చెప్తుంది. మరి సరోగసీ ద్వారా మీరా గర్బం దాల్చి మురారిని తనవైపుకు తిప్పుకుంటుందా? కృష్ణ, మురారీలకి మీరా ప్లాన్ తెలుస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఆ తర్వాత ఏం జరిగిందంతా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.