Read more!

English | Telugu

Krishna Mukunda Murari : ఆమెకి పిల్లలు పుట్టరని తెలిసిపోయింది.. సరోగసి ద్వారా పిల్లలు కనగలరా?

స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'.. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -456 లో... కృష్ణ తనకేమైందో తెలుసుకోడానికి హాస్పిటల్ కి వెళ్ళగా.. అక్కడ పరిమళ డాక్టర్ ఉండదు. ఇక అప్పుడే కృష్ణకి తీవ్రమైన కడుపునొప్పి వస్తుంది. దాంతో అక్కడే కూలబడిపోతుంది. అక్కడ నర్స్‌లు.. కృష్ణను గుర్తుపట్టి.. లోపలికి తీసుకుని వెళ్లారు. డాక్టర్ పరిమళ వారం ముందే అమెరికా వెళ్లాదని తెలియడంతో.. మరో గైనకాలజిస్ట్‌ని పిలుస్తుంది కృష్ణ. హాస్పిటల్ లో కృష్ణకి టెస్ట్‌లు నడుస్తుంటాయి. ఇక ఇంట్లో కృష్ణ ఎక్కడ అని రేవతి వెతికి వెతికి.. కృష్ణ ఎక్కడా మురారిని అడుగుతుంది. గుడికి వెళ్లిందనుకుంటా అమ్మా అని మురారి అంటాడు.  అయ్యో ఎండలు ఎక్కువగా ఉన్నాయి. వెళ్లి తీసుకునిరా అంటుంది రేవతి. ఇక మురారీ సరే అని ఫోన్ కోసం గదిలోకి వెళ్తాడు.

ఇక అప్పుడే మురారి ఫోన్ రింగ్ అవుతుంది. మీ భార్యకి కడుపునొప్పి ఉంది.. అర్జెంట్ గా హాస్పిటల్ కి రండి అని నర్స్ అంటుంది. సరేనని ఫాస్ట్ గా హాస్పిటల్ కి వచ్చేస్తాడు మురారి. మరోవైపు అన్ని పరీక్షలు చేసిన డాక్టర్.. కృష్ణకు నిజం చెబుతుంది. గర్భసంచి తీసెయ్యాలి.. పిల్లలు పుట్టరు. మీరు బాధపడతారని పరిమళా మేడమ్ నిజం చెప్పలేదేమోనని అంటుంది. అది విని కృష్ణ ఏడుస్తుంటుంది‌‌. మీరా చాటుగా నిలబడి.. అంతా వింటు హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతలో మురారీ వచ్చి.. కృష్ణ ఏడవడానికి కారణం తెలుసుకుని గుండెలకు హత్తుకుని ఏడుస్తాడు. అయితే కృష్ణ కాసేపటికి.. నేనేం అయిపోతానో అని నిజం చెప్పలేదు కదా ఏసీపీ సర్ అంటుంది. అవునని మురారి చెప్తాడు‌. అదంతా చాటుగా చూసిన మీరా.. మురారీ బయటికి రాగానే ఎదురుగా వెళ్తుంది. మీ పర్మీషన్ లేకుండా మీ ఫోన్ లిఫ్ట్ చేసింది నేనే. పరిమళ ఆసుపత్రి అని ఉంది. ఏదో ప్రమాదం జరగుతుందని భయపడి లిఫ్ట్ చేశాను. నర్స్ విషయం చెప్పగానే ఇక్కడికి వచ్చాను. కృష్ణ పరిస్థితి తెలిసి అల్లాడిపోయాను మురారీ గారు. పాపం కృష్ణ అంటూ నటించేస్తుంది మీరా. మీకు తెలిసిన ఈ నిజాన్ని ఎవరికీ చెప్పొద్దని మీరాతో మాట తీసుకుంటాడు మురారీ. భవానీ మేడమ్ గారు బాధపడకుండా ఉండాలంటే.. కృష్ణ పరిస్థితి చెప్పకుండా సరోగసికి ప్రయత్నించండి మురారీ గారు. దానివల్ల ఇంట్లో ఎవ్వరు బాధపడరని మీరా అనగానే.. సరే ఆలోచిస్తానని మురారి అంటాడు.

భాదని గుండెల్లో దాచుకొని కృష్ణ దగ్గరికి మురారి వెళ్తాడు. ఇక అప్పుడే.. ఏసీపీ సర్ నన్ను ఎక్కడికైనా ఏకాంతంగా ఉండే చోటికి తీసుకుని వెళ్లండని కృష్ణ అంటుంది. సరే పదా వెళ్దామని మురారి అంటాడు. ఇక తరువాయి భాగంలో.. మురారీ, కృష్ణ ఇద్దరు ఒక చోట ఏకాంతంగా కూర్చుని మాట్లాడుకుంటారు. పెద్దత్తయ్య మాట నిలబెట్టుకోవాలంటే ఒకే మార్గం ఉంది ఏసీపీ సర్.. సరోగసికి వెళ్దాం.. ఒక మంచి అమ్మాయిని చూసి.. మన బిడ్డను తన కడుపులో పెంచేలా చేద్దాం ఏం అంటారు ఏసీపీ సర్ అని కృష్ణ  అనగానే..  మురారీకి మీరా ఇచ్చిన ఐడియా కూడా అదే కావడంతో.. మురారీ కూడా సరే అంటాడు.  ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.