Read more!

English | Telugu

Krishna Mukunda Murari : తాగొచ్చిన భర్తని చూసి కుమిలికుమిలి ఏడ్చిన భార్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి '. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -454 లో... మీరా పాప, బాబు బొమ్మలు కృష్ణకి ఇవ్వగా.. వాటిని అపురూపంగా పట్టుకొని మురారి దగ్గరకు వస్తుంది. తను వారసుడిని ఇస్తుందని అందరు అపురూపంగా చూసుకుంటున్నారని.. పెద్దత్తయ్య కోరిక త్వరగా తీర్చాలని భర్తతో అంటుంది. మురారి ఉలుకు పలుకు లేకుండా అలాగే ఉండటంతో ముందు తాగి వచ్చారా అని ప్రశ్నిస్తుంది. రాత్రి నుంచి చూస్తున్నా నేను నిద్రపోయినప్పుడు మెలకువగా ఉండి ఏడుస్తున్నారు. సరిగా మాట్లాడటం లేదు. తప్పించుకొని తిరుగుతున్నారు. సరే కానీ అవన్నీ కాదు. ఈ పరిస్థితుల్లో ఎందుకు తాగోరో చెప్పండని కృష్ణ అడుగగా.. అవును తాగాను అని అరుస్తాడు. బాధ తట్టుకోలేక ఎవరికి చెప్పుకోలేక నాలో నేను కుమిలిపోతూ తాగానని మురారి అంటాడు. 

బాధా.. అంత బాధ ఏముంది మీ మనసులో.. ఒక్కరే మధన పడాల్సిన అవసరం ఏముంది. ఏమైంది ఏసీపీ సర్.. మీరు ఇంతలా బాధపడటం నేనెప్పడూ చూడలేదు. మిమల్ని చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. నాకూ చెప్పకూడదా అని కృష్ణ అడుగుతుంది. ఏం లేదు కృష్ణ ఎంత మర్చిపోదాం అనుకున్నా మర్చిపోలేకపోతున్నా.. నువ్వు కడుపు నొప్పితో విలవిల్లాడిపోయావ్ కదా అది గుర్తొచ్చి తట్టుకోలేకపోతున్నా. నీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేనని మురారి అనగానే.. అసలు నాకేమైందని కృష్ణ అంటుంది. అదేం లేదు చెప్పాలనిపించింది చెప్పానంతే అని మురారి హడావిడిగా వెళ్లి పడుకుంటాడు. మరోవైపు మీరాని ఆదర్శ్ రమ్మని పిలిచి గులాబీలతో ముకుందకు ప్రపోజ్ చేస్తాడు.. ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్టుగా చెప్తాడు. దాంతో మీరా షాక్ అయిపోతుంది. ఇక కృష్ణ, మురారిలు ఆదర్శ్‌ ప్రపోజ్ చేయడం చూస్తారు. అది చూసి కృష్ణ వచ్చి.. ఆదర్శ్‌ చేతిలోని గులాబీలు తీసుకొని నేలకు విసిరికొడుతుంది. దాంతో కృష్ణ మీద ఆదర్శ్ సీరియస్ అవుతాడు. తనని ప్రేమిస్తే నీకేంటి ప్రాబ్లమ్ అని కృష్ణతో ఆదర్శ్ అంటాడు. ఈ ఇంటికి ప్రాబ్లమ్ అని.. ఒకవేళ నీకు తను ఇష్టమైతే ఈ ఇంట్లో వాళ్లని అడగాలి. వాళ్లకి ఇష్ట లేకపోతే వదిలేయాలి అర్థమైందా.. అని అడగ్గానే ఆదర్శ్‌ ఒక్కసారిగా లేస్తాడు.  అదంతా ఆదర్శ్‌ కల అన్నమాట. దీంతో కంగారు పడిన ఆదర్శ్‌.. అప్పుడే ముకుంద దగ్గరకు వెళ్లి విషయం చెప్పాలని అనుకుంటాడు. నీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను అని ఆదర్శ్ అనగానే.. అంటే ఏం చెప్తాడా అని మీరా కంగారుపడుతుంది. ప్రపోజ్ చేస్తాడేమోనని మీరా అనుకొని.. రేపు జాగింగ్‌కు వెళ్తూ మాట్లాడుకుందామని చెప్పి ఆదర్శ్‌ని పంపేస్తుంది. 

ఆదర్శ్ తనకి ప్రపోజ్ చేయడానికే వచ్చాడని, ఇకపై ఆదర్శ్‌కి ఒంటరిగా దొరకకూడదని.. దొరికినా మాట్లాడే ఛాన్స్ అస్సలు ఇవ్వకూడదని మీరా అనుకుంటుంది. మరోవైపు కృష్ణ భవానికి ఇచ్చిన మాట తల్చుకొని బాధపడుతుంది. మురారి వైపు చూస్తే మురారి మంచి నిద్రలో ఉంటాడు. ఇక ఉదయం ఆదర్శ్‌ మీరా వస్తుందని జాగింగ్‌కు రెడీ అవుతాడు.. మీరా ఒప్పుకుంటే అమ్మ ఒప్పుకుంటుందని ఆదర్శ్ అనుకుంటాడు. ఇక మీరా బయటకు వస్తూ.. ఆదర్శ్‌ని చూసి తలుపేసేస్తుంది. ఎలా తప్పించుకోవాలా అనుకుంటుంది. ఇంతలో ఆదర్శ్ వచ్చి.. మీరా డోర్ కొడతాడు.  ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.