Read more!

English | Telugu

Krishna Mukunda Murari : సర్ ప్రైజ్ ఇచ్చిన మధు..‌ రగిలిపోయిన ముకుంద!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -448 లో.. అందరు ఆదర్శ్, మీరాల గురించి హాల్లో ఉండి మాట్లాడుకుంటారు. అయితే మరోవైపు సంగీతతో మధు పులిహోర కలిపేస్తుంటాడు. సంగీతను పట్టుకుంటూ ఇలా ముఖం పెట్టి.. ఇలా నవ్వూ అంటూ ఫొటోలు తీస్తుంటాడు. కూతుర్ని వెతుక్కుంటూ వచ్చిన రజినీ.. అది చూసి.. మధుని తిట్టిపోతుంది. అప్పుడే కృష్ణ అడ్డుపడి.. మధుది ఏం తప్పుంది? గాజులవాడు చేయి పట్టుకుని గాజులు వేయడం తప్పా? అలానే ఇది కూడా.. మధు ఓ ఫోటోగ్రాఫర్ అండ్ డైరెక్టర్. తనకు అందంగా ఉన్నదాన్ని మరింత అందంగా చూపించడం ఇష్టం.. మన మధునే కదా.. సంగీత అందంగా ఉంది. అందుకే ఫొటోలు తీస్తున్నాడు ఇందులో తప్పేముందని కృష్ణ అంటుంది.

మరోవైపు రాత్రి అయ్యేసరికి భవాని అందరికీ.. రేపు నవమి కదా.. కొత్త బట్టలు తీసుకోండి. రేపు కళ్యాణం జరిపిద్దామంటు అందరికీ బట్టలిస్తుంది. అప్పుడే మురారీ, కృష్ణలు కలిసి భవానీకి మాటిచ్చిన ఫొటోని మధు ప్రింట్ తీయించి, ఫ్రేమ్ కట్టించి గోడకు తగిలిస్తాడు. అది అందరికి చూపించి సర్ ప్రైజ్ అని మధు అంటాడు. ఇక అప్పుడే ముకుంద రగిలిపోతుంది. ఆ ఆనందం లేకుండా చేస్తానని మీరా తన మనసులో అనుకుంటుంది. రేపు రాముల వారి కళ్యాణానికి పానకం నేనే చేస్తాను మేడమ్ అని భవానిని మీరా రిక్వెస్ట్ చేయగా.. సరేనంటుంది భవాని. అందులోనే వైదేహి రాసిచ్చిన టాబ్లెట్ కలిపి కృష్ణతో తాగిస్తానని మీరా అనుకుంటుంది. అనుకున్నట్లే రాత్రి అంతా పడుకున్నాక మీరా.. బయటికి వెళ్లి ఆ టాబ్లెట్స్ తెస్తుంది. అప్పటికే మీరా కోసం ఆదర్శ్ వెతుకుతూ.. బయట నుంచి రావడం చూస్తాడు. ఎక్కడికి వెళ్లావ్ ముకుందా అని అదర్శ్ అడుగుతాడు. కాసేపు రకరకాలుగా ప్రశ్నలు వేసి విసిగిస్తాడు. భవాని మేడమ్ చీర ఇచ్చారు కదా.. జాకెట్ కుట్టించుకోవడానికి వెళ్లానని చివరికి తప్పించుకుంటుంది మీరా‌.

ఇక తెల్లవారు జామున కృష్ణ రెడీ అయ్యి బయట ముగ్గు వేస్తుంటుంది. అప్పుడే ఆదర్శ్ జాగింగ్ వెళ్దామని స్టార్ట్ అయ్యి కృష్ణని చూసి ఆగుతాడు. ఛ.. పొద్దున్నే ఈవిడగారి ముఖం చూశాను. ఏం జరుగుతుందో ఏంటో అనుకుంటు ఆదర్శ్ వెనక్కి వెళ్లబోతుంటే... అది విన్న కృష్ణ.. ఆదర్శ్.. ఏమన్నావని అడుగుతుంది. ఇంతలో మురారీ అటుగా వచ్చి.. హేయ్ ఆదర్శ్? ఏమైందిరా.. జాగింగ్‌కి వెళ్ళలేదా అని అంటాడు. లేదు శకునం బాలేదులే.. అన్నీ చూసుకుని వెళ్లడం ఉత్తమం కదా అని కృష్ణను ఆదర్శ్ ఓ చూపు చూసి లోపలికి వెళ్లిపోతాడు. వెంటనే మురారీతో కృష్ణ.. చూశారా.. తను అనేది నన్నే అంటూ తను అంతకుముందు విన్నమాటలన్నీ వివరంగా చెబుతుంది. అయితే మురారీ నమ్మడు. ఆదర్శ్ మారాడు కృష్ణా.. అంతా నీ భ్రమ అంతే అంటూ నచ్చజెబుతుంటాడు. అయితే వీళ్లమాటలు చాటుగా మీరా వింటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో‌ తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.