Read more!

English | Telugu

Krishna Mukunda Murari : ఏకమైన కృష్ణ, మురారీలు.. వాళ్ళ శోభనం చూసి అల్లాడిన ముకుంద!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -445 లో..  పూట... మురారీ గదికి రెడీ అయ్యి వచ్చిన కృష్ణ.. మురారీని ఆటపట్టించడం.. ఒకరిని ఒకరు కొంటెగా చూసుకోవడం కొనసాగుతూ ఉంటుంది. ఇంతలో మీరా(ముకుంద).. కిటికీలోంచి మురారీ వాళ్ల గదిలోకి చూస్తుంది. ఆమె చూస్తుండగానే మురారీ, కృష్ణలు మంచం మీద వాలిపోతారు. చాలా సినిమాల్లో చూపించినట్లుగా.. శోభనం జరుగుతున్నట్లుగా.. కెమెరాను పక్కకు తీస్తారు. అయితే అప్పుడే ముకుంద.. వారిద్దరిని ఆ విధంగా మంచం మీద చూసి.. కుమిలికుమిలి ఏడుస్తుంది.

మురారీ, కృష్ణల మధ్య సీన్ జరుగుతున్నట్లు.. అది చూసి ముకుంద అక్కడే కూలబడి ఏడుస్తున్నట్లు వీక్షకులకు అర్థమవుతుంది. ఇక రాత్రంతా ముకుంద అక్కడే ఉండి ఏడుస్తుంది. మరునాడు ఉదయాన్నే ముకుంద.. ఏడ్చుకుంటూనే కిటికీలోంచి చూస్తూ పైకి లేస్తుంది. అప్పటికే మురారీ గదిలో మంచం మీద నిద్రపోతుంటాడు. కృష్ణ అప్పటికే కిందకు వెళ్లి తల స్నానం చేసి కాఫీ రెడీ చేస్తూ ఉంటుంది. దాంతో ముకుంద.. మెల్లగా అడుగులు వేస్తూ.. ఎవరూ రావట్లేదని గమనించుకుని మురారీ గదిలోకి వెళ్తుంది. మురారీ ముందుకు వెళ్లి అక్కడే ఏడుస్తూ మురారీని చూస్తుంది. ఎంత అన్యాయం చేశావ్ మురారీ.. నీ కోసం ఎంత తపించాను.. ఎన్ని పాట్లు పడ్డాను.. చివరికి నా రూపాన్నే మార్చుకుని నీకోసం మళ్లీ పుట్టాను.. కానీ నువ్వు ఆ కృష్ణకు సొంతం అయిపోయావ్.. నీకు ఇది న్యాయమా మురారీ.. అంతా జరిగిపోయింది కదా అని వదిలేస్తాననుకున్నావేమో.. అసలు వదిలిపెట్టను మురారీ.. నిన్ను అసలు వదులుకోను.. అసలు ప్లాన్ ఇప్పుడే మొదలుపెట్టబోతున్నాను మురారీ.. కృష్ణ నీకు దూరం కాకుండా నువ్వు నాకు దగ్గర కాకుండా ఎవ్వరూ ఆపలేరని ఓవైపు ఏడుస్తూ మరోవైపు అంటూ పగతో రగిలిపోతుంది‌. అయితే మురారి నిద్రలోనే ఉంటాడు. ఇక ముకుంద పైకి లేచి వెళ్లిపోయే క్రమంలో.. ఆక్కడే టేబుల్ మీదున్న గ్లాస్ కిందపడి శబ్దం వస్తుంది. మురారీకి మెలుకువ వస్తుంది కానీ కళ్లు తెరవడు. ఆ శబ్దం చేసింది కృష్ణ అనుకుంటాడు. ‘హేయ్ కృష్ణా.. అప్పుడే లేచావా.. రా కృష్ణా.. ఇటురా దగ్గరకు రా.. పక్కనే కూర్చో’ అంటూ ఉంటాడు మురారీ కొంటెగా, గారంగా. మురారీ మాటలకు ముకుంద ఇంకా రగిలిపోతుంది.‌ కాసేపటికి మీరా గది నుండి బయటకు వస్తుండగా.. కృష్ణ గది లోపలికి వస్తుంటుంది. ఇక తనకి కనపడకుండా మెల్లిగా దాక్కొని బయటకొచ్చేస్తుంది మీరా.

వాళ్ళిద్దరిని అలా చూడలేక తండ్రి దగ్గరకు వెళ్లిపోతుంది మీరా. నాన్నా ముకుంద పేరుతో ఉన్న అకౌంట్‌లోకి నాలుగు కోట్లు ట్రాన్స్‌ఫర్ చేశావా.. ఇప్పుడు ఈ మీరా రూపంలో దాన్ని ఎలా తీసుకోవాలి? బ్యాంక్ వాళ్లు ఎలా నమ్ముతారని అంటుంది. అవి ఇల్లు అమ్మిన డబ్బులు. నీకు కాల్ చేస్తే.. కట్ చేస్తున్నావని నీకు అవసరం ఉంటుందని అలా వేశాను తల్లీ.. పైగా ఎలక్షన్స్ టైమ్. వాటితో నేను దొరికితే జైలుకు వెళ్లే పరిస్థితి. పోనీ ఓ పని చెయ్.. నువ్వే ముకుందవని.. డాక్టర్ దగ్గర ముఖం మార్చినట్లుగా.. సర్జరీ జరిగినట్లు ఒక్క సర్టిఫెకెట్ బ్యాంక్‌లో సబ్మిట్ చేస్తే చాలు కదమ్మా అని మీరాతో శ్రీనివాస్ అంటాడు. అలా చేస్తే నేను దొరికిపోతాను కదా నాన్నా అని మీరా అంటుంది. ఏమోనమ్మా నీకోసం నేను చాలా చేశాను. ఏ తండ్రీ ఇంత చేయడు. తీసుకుంటే ఆ అకౌంట్‌లో డబ్బులు తీసుకో.. లేదంటే లేదని అనగా.. మీరా ఏడ్చేస్తుంది. నేను అసలే తిక్కలో ఉన్నాను నాన్నా.. ఆ మురారీ, కృష్ణలు నిజమైన భార్యభర్తలుగా ఏకమైపోయారు. ఇక లాభం లేదు నాన్నా.. కృష్ణ ఉన్నంత కాలం నేను నా లక్ష్యాన్ని చేరుకోలేను.. తప్పో ఒప్పో.. ముకుందగా చనిపోయిన నేను.. మరొకరిని బలి ఇవ్వడానికి వెనకాడనంటుంది. ముకుంద మాటలకు శ్రీనివాస్ షాక్ అవుతాడు. మరి ఏకమైన కృష్ణ, మురారీలని ముకుంద ఏం చేయనుందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.