Read more!

English | Telugu

Krishna Mukunda Murari : మురారి బిడ్డ నా కడుపులో పెరగాలి కృష్ణ.. నీ ఆశ తీరదు!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-442లో.. ముకుంద, మురారి, కృష్ణ, అదర్శ్ అంతా కలిసి హోలీ జరుపుకుంటారు. ఇక ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్తారు. ముకుంద అద్దంలో తనని తాను చూసుకుంటు.. మురారికి రంగులు పూసినది గుర్తుకుచేసుకుంటంది. అప్పుడే ముకుంద దగ్గరికి రేవతి వచ్చి.‌. నీ తీరేంటి ఆదర్శ్ తో ఆ చనువేంటని అడుగగా.. మీరు నన్ను అవమానించడం పక్కన పెట్టి.. మొదట భవానీ మేడమ్ తో ఒకసారి ఆదర్శ్, సంగీతల పెళ్ళి గురించి మాట్లాడండి అని చెప్తుంది. ఇక అదే విషయం మాట్లాడటానికి భవాని దగ్గరికి వెళ్ళిన రజినీ.. సంగీత, అదర్శ్ ల పెళ్ళి చేద్దాం వదిన అంటుంది.

ఇక అక్కడే ఉన్న మీరా అలియాస్ ముకుంద.. అవును మేడమ్ ఆదర్శ్ గారు ముకుందని మర్చిపోవాలంటే వీళ్ళిద్దరి పెళ్ళి చేయాలని, సంగీతకి కూడా ఆదర్శ్ గారంటే ఇష్టమని మీరా అంటుంది. నా కొడుకు సంతోషంగా ఉంటాడంటే వాడి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాని భవాని అంటుంది. నువ్వు ఆ మాట అన్నావ్ నాకు సంతోషంగా ఉంది వదిన అని రజినీ మురిసిపోతుంది‌. కాసేపటికి అందరు తినడానికి వస్తారు. హోలీ రోజున దిగిన ఫోటోలని మధు అందరికి చూపిస్తుంటాడు‌.  అదర్శ్, మురారి పక్కపక్కనే  కూర్చొని తినడం చూసి భవాని సంతోషిస్తుంది. ముకుందని మీరా అని పిలుస్తుంది కృష్ణ. ఇక అది విని పేరు మారింది కదా మర్చిపోయావా అని అడుగగా.. లేదు కావాలనే పిలిచానని కృష్ణ అంటుంది. ఆదర్శ్ కోప్పడతాడేమోనని ఇప్పుడు ఎందుకని మురారి అంటాడు. అలా అంటారేంటీ ఏసీపీ సర్.. మీరా పేరు ఎంత చక్కగా ఉంటుంది. ఏదో ముకుంద మీద అభిమానంతో అలా ముకుందగా మారింది కానీ.. సొంత పేరు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అని కృష్ణ అంటుంది. 

కృష్ణ మాటలకు ఆదర్శ్ కోపంగా ఉంటాడు. నాకేం ఇబ్బంది లేదని మీరా అనగా.. ఇక్కడ ఎవ్వరూ బలవంతంగా రుద్దలేదు.. తనని అడిగే పేరు మార్చాం.. అమ్మ కూడా ఒప్పుకుంది కదా.. ఇంకా తనకేంటి సమస్య మురారీ అని అదర్శ్ కోపంగా అంటాడు. హా..హ.. సమస్యేం లేదు ఆదర్శ్.. పాపం మీరాకు ఇష్టం లేదేమోనని మురారి అంటాడు. కాసేపటికి మీరా నీకో గిఫ్ట్ తెచ్చానని ఫోన్ ఇస్తుంది కృష్ణ. అది తీసుకొని థాంక్స్ చెప్తుంది. ఆ తర్వాత భవాని వాళ్ళ కంపెనీలో ముకుందకి జాబ్ ఇస్తానని చెప్తుంది. ఇక ఈ అవకాశాన్ని ఎలా మల్చుకుంటానో చూడని మీరా అలియాస్ ముకుంద తన మనసులో అనుకుంటుంది. ఇక తరువాయి భాగంలో.. మురారికి కృష్ణ కితకితలు పెడుతుంటుంది. అప్పుడే అలమరాలోని పుస్తకాలలో ఉన్న లెటర్ కిందపడుతుంది. నువ్వు అమ్మవి   అవుతే చూడాలని ఉందే తింగరి అని కృష్ణకి భవాని రాసింది చదివి సంతోషిస్తుంది. మరోవైపు మురారి బిడ్డ నా కడుపులో పెరగాలి కృష్ణ.. నీ ఆశ తీరదని అనుకుంటూ ముకుంద అలియాస్ మీరా ఆ లెటర్ ని చింపేస్తుంది‌.  ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.