Read more!

English | Telugu

వాళ్ళిద్దరిని కలిపిన కృష్ణ.. భవాని పంతం వీడింది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-155 లో.. కృష్ణ మురారి బర్త్ డే  కోసం ఇల్లంతా డెకరేషన్ చేస్తుంది. రేవతి వచ్చి మురారి ఎక్కడ అని కృష్ణని అడుగుతుంది. రెడీ అయి కిందకి రమ్మని చెప్పానని కృష్ణ అంటుంది. ఇలా నీతో మాట్లాడడం చూస్తే.. అక్క నన్ను కూడా వెలివేస్తుందని రేవతి అంటుంది. పర్లేదు అత్తయ్య ఉండండి.. పెద్ద అత్తయ్య కూడా వస్తారని కృష్ణ అంటుంది. ఇంతలోనే మురారి రెడీ అయి కిందకి వస్తాడు. మురారికి రేవతి విషెస్ చెప్తుంది.

కృష్ణ, మురారి, రేవతి ముగ్గురు కలిసి మాట్లాడుకుంటుండగా.. అప్పుడే అక్కడికి ముకుంద వస్తుంది. ఈ ముకుంద ఒకతి ఇలా మీతో మాట్లాడానని భవాని అక్కకి చెప్తుందేమో.. అయిన నేను నా కొడుకు పుట్టినరోజు కూడా దగ్గర ఉండి చెయ్యకూడదా అని రేవతి అంటుంది. ముకుంద వచ్చి మురారి కి విషెస్ చెప్తుంది. ఇక నువ్వు కేక్ కట్ చెయమని మురారికి చెప్తుంది రేవతి. అలా రేవతి అనేసరికి పెద్దమ్మ లేకుండా ఎప్పుడు కేక్ కట్ చెయ్యలేదని మురారి బాధపడుతాడు. మీ పెద్దమ్మ వస్తుంది.. ఆగండని కృష్ణ అంటుంది. నీతో వస్తానని చెప్పిందా అని మురారి అంటాడు. కృష్ణ అక్కడికి రాకముందే.. భవాని గదిలోకి వెళ్లి ఒక‌ గోడకి యశోద, కృష్ణల ఫోటోని ఉంచి.. మీ చిన్ని కృష్ణడు కేక్ కట్ చేసేటప్పుడు మీరు లేకుంటే ఎలా అని రాసి వచ్చేస్తుంది. ఇక ఆ ఫోటోని చూసిన భవాని మురారికి తనపై ఉన్న ప్రేమని గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది.

ఆ తర్వాత ఒక బొకే పట్టుకొని భవాని వస్తుంటే.. మురారితో సహా అందరూ షాక్ అవుతారు. నేను చెప్పాను కదా వస్తారని కృష్ణ అంటుంది. గడుసుదానివే మా అక్కని అన్ని మెట్లు దిగేలా చేసావని రేవతి అంటుంది. భవాని వచ్చి మురారికి విషెస్ చెప్పి ఆశీర్వదిస్తుంది. వట్టి బొకేనేనా, గిఫ్ట్ ఏం లేదా అని కృష్ణ అంటుంది. నేను మీతో మాట్లాడుతున్నా కదా.. ఇదే పెద్ద గిఫ్ట్ ఈ రోజు నుండి మీతో అందరు మాట్లాడుతారని భవాని అనగానే అందరూ సంతోషిస్తారు. నువ్వే మా మధ్య దూరం పెంచావ్.. నువ్వే దూరం తగ్గించావని కృష్ణని అంటుంది భవాని. నాకు చాలా హ్యాపీగా ఉంది అత్తయ్య.. ఇన్ని రోజులు మురారితో ఎవరు మాట్లాడొద్దంటే ఇల్లంతా డల్ గా ఉండేదని ముకుంద సంతోషపడుతుంది. మురారి కేక్ కట్ చేసి భవానికి తినిపిస్తాడు. ఆ తర్వాత రేవతి, కృష్ణలకి తినిపిస్తాడు.

ముకుంద కేక్ తీసుకొని మురారికి తినిపిస్తుంది. మురారి కేక్ తీసుకొని ముకుందకి తినిపిస్తుండగా ఒక్కసారిగా ఆగిపోయి తన చేతికి ఇస్తాడు. మురారి అలా చేసేసరికి ముకుంద డల్ అయిపొయి కేక్ ని కింద పడేస్తుంది. మనం అందరం గుడికి వెళదాం.. రెడీ అయి రండని భవాని చెప్తుంది. మరొకవైపు ఈ రింగ్ ఎలా అయినా మురారి వేలుకి తొడగాలని ముకుంద అనుకుంటుంది.

మరొకవైపు కృష్ణ, మురారిలు గదిలోకి వెళ్ళి సంతోషంతో డాన్స్ చేస్తారు. కృష్ణ మాత్రం మురారితో కలిసి చెయ్ పట్టుకొని డాన్స్ చేస్తున్నట్లు ఉహించుకుంటుంది. ఈ సంతోషంకి ఇలా క్లాస్ డాన్స్ కాకుండా.. మాస్ డాన్స్ చేయాలని ఇద్దరు అనుకొని డాన్స్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.