Read more!

English | Telugu

కృష్ణ ఎదలోయల్లో ఉందెవరో మురారికి చెప్తుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కృష్ణ ముకుంద మురారి. ఈ సీరియల్ శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌-167లో.. కృష్ణ తన గదిలో ఒంటరిగా ఉంటుంది. ఆ తర్వాత మురారి కోసం కలలు కంటుంది. తను గదిలోకి వచ్చినట్టు.. తనతో కలిసి డ్యాన్స్ చేసినట్టుగా కలలు కంటుంది. ఆ తర్వాత కాసేపటికి వాళ్ళ నాన్న ఫోటోని చూస్తూ బాధపడుతుంది కృష్ణ.

కాసేపటికి మధు హాల్లోకి వచ్చి.. ఇంట్లో‌ వాళ్ళందరిని పిలుస్తాడు. ఏమైందని అందరూ కంగారుగా వస్తారు.  మీ అందరికి ఒక గుడ్ న్యూస్ నేను డైరెక్ట్ చేసిన లవ్ స్టోరీ ఫైనల్ ప్రివ్యూ కాసేపట్లో వస్తుంది మీరందరూ రెడీగా ఉండండి అని అనగానే.. మధు వాళ్ళ నాన్న తనని ఇష్టమొచ్చినట్టు తిడతాడు. ఆ తర్వాత నువ్వు ఆ వీడియో తీసావని కాదు.. అందులో నా కోడలు కృష్ణ చేసిందని నాకు చూడటానికి ఇంట్రస్ట్ గా ఉందని రేవతి అంటుంది. ‌మధుని వాళ్ళ నాన్న తిట్డి.. నీకోసం కాదు కృష్ణ కోసమే నేను కూడా చూస్తానని అంటాడు. సర్లే.. నువ్వు వెళ్ళి కృష్ణ , ముకుంద, మురారిలని పిలుచుకురా అని మధు వాళ్ళ భార్యకి చెప్తాడు. తను పిలుచుకురావడానికి వెళ్తుంది.

మరోవైపు గదిలో ఉన్న కృష్ణ అన్ని సర్దుకుంటుంది. అప్పుడు తన అలమరాలో చిన్న కృష్ణుడి ప్రతిమ కనిపిస్తుంది. అయ్యో కన్నయ్య అని తన చేతిలో తీసుకుంటుంది కృష్ణ. ఆ తర్వాత కృష్ణుడు నల్లగవ్వడం గమనిస్తుంది కృష్ణ. ఒక క్లాత్ తో ఎంత తుడిచినా ఆ బ్లాక్ పోదు.. అయితే అప్పుడే గదిలోకి మురారి వస్తాడు. మురారి రావడం చూసిన కృష్ణ.. వెంటనే తన చేతిలో ఉన్న కృష్ణుడి బొమ్మ కనపడకుండా తన వెనుకాల దాచుకుంటుంది. అయితే అది గమనించిన మురారి.. చేతిలో ఏంటని అని ఎంత అడిగినా చెప్పదు.

దాంతో కృష్ణ చేతులని మురారి చూస్తాడు. కృష్ణుడి నల్లగవ్వుతున్నాడని అంటుంది కృష్ణ. అయితే అది చూసిన మురారి సైలెంట్ గా ఉంటాడు. మురారి వెనకకు తిరిగి.. ఏంటి కృష్ణుడు నల్లగవుతున్నాడని అంటుంది.. నేనంటే తనకి ప్రేమ లేదా? నన్ను వదిలేసి వెళ్ళే రోజు దగ్గరపడుతుందని కృష్ణ ఇండైరెక్ట్ గా చెప్తుందా అని మురారి తన మనసులో అనుకుంటాడు. అదే టైంలో కృష్ణ కూడా ఇంచుమించు అలానే అనుకుంటుంది. ఏసీపీ సర్ కి నా మీద ప్రేమ ఉందో లేదో ఎలా తెలుసుకోవాలని కృష్ణ అనుకుంటుంది. సరిగ్గా అదే సమయానికి మధు వాళ భార్య వచ్చి.. మీరు కలిసి చేసిన వీడియో ప్రివ్యూ వస్తుందంట ఇద్దరు రండి అని అనగానే.. సరేనని అంటుంది కృష్ణ. కాసేపటికి మురారి వాళ్ళ గదిలో నుండి బయటకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.