Read more!

English | Telugu

ముకుందని మధ్యలోనే దింపేసిన కృష్ణ ప్లాన్ ఏంటి?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -123లో..  కృష్ణ, ముకుంద, మురారి కలిసి కార్ లో బయటకు వెళ్ళడానికి బయల్దేరే ముందు.. కృష్ణ నువ్వు ముందు కూర్చో, ముకుంద వెనకాల కూర్చుంటుందని మురారి చెప్పడంతో ముకుంద కోపంగా చూస్తుంది. కృష్ణకి సీట్ బెల్ట్ పెట్టుకోవడం రాకపోవడంతో మురారినే సీట్ బెల్ట్ పెడతాడు. అది చూసి ముకుందకి కోపం ఇంకా పెరుగుతుంది. 

మరోవైపు భవాని దగ్గరికి ఈశ్వర్ వచ్చి.. వదిన నందుని అమెరికా పంపించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయంటూ ఒక ఫైల్ తీసుకొచ్చి భవానికి చూపిస్తాడు. నందుని అమెరికా పంపించడం ప్లాన్ A అయితే మరి ప్లాన్ B ఏంటి వదిన అని ఈశ్వర్ అడుగుతాడు. అప్పుడు భవాని ఎవరికో కాల్ చేసి.. నేను చెప్పింది చేస్తే మీ ఫ్యామిలీకి ఏ లోటు లేకుండా చూస్తానని చెప్పగానే.. అవతలివైపు నుండి కాల్ మాట్లాడుతున్న వ్యక్తి సరే అని అంటాడు. ఇదంతా విన్న ఈశ్వర్ మీ ప్లాన్ సూపర్ వదిన.. మీరు గనుక రాజకీయాల్లో ఉంటే బాగుండని చెప్పి‌‌.. అయినా ఇవ్వన్నీ మీకు నచ్చవ్ కదా అంటాడు ఈశ్వర్. కాగా ఆ ప్లాన్ ఏంటో మాత్రం బయటకు రివీల్ చేయలేదు. మరోవైపు "కృష్ణ బాగా ఎండగా ఉంది కదా.. ఆ ఏసీ వేసుకో" అని మురారి అంటాడు. ఇక్కడ నాకు మండుతుంది అని ముకుంద అనగానే.‌. వెనకాల కూడా ఏసీ ఉందని మురారి అంటాడు. ఇక కృష్ణకి దగ్గు వస్తుంటే మురారి వాటర్ బాటిల్ ఇచ్చి తల నిమురుతుంటే ముందు చూసి నడుపు అని ముకుంద అంటుంది. నువ్వు కరెక్ట్ గా చూడలేదంటే, నువ్వు దిగవలసిన షాపింగ్ మాల్ వెళ్ళిపోతే.. మళ్ళీ నువ్వు నడిచి వెళ్ళవలిసి ఉంటుందని మురారి అంటాడు. అవును ముకుంద నువ్వు ఎక్కడ దిగాలని కృష్ణ అడగగానే.. నిన్ను కాలేజీ దగ్గర దింపేసిన తర్వాతే నేను షాపింగ్ మాల్ కి వెళ్తానని ముకుంద అంటుంది. ఏంటి ముకుంద.. నువ్వు మా ప్రైవసీకి అడ్డుగా ఉంటావ్.. నేను సర్ తో పర్సనల్ గా మాట్లాడాలని కృష్ణ చెప్తుంది. ఆ తర్వాత మురారిని కార్ ఆపమని చెప్పి ముకుందని దిగమంటుంది కృష్ణ. అదే మాట మీ ఏసీపీ సర్ ని అనమని చెప్పు కృష్ణ అని ముకుంద అనగానే.. మురారి సైలెంట్ గా ఉంటాడు. ఇక చేసేదేమీలేక ముకుంద కార్ దిగుతుంది. కృష్ణతో మాట్లాడాలని కావాలనే కార్ ఆగిపోయినట్లు యాక్ట్ చేస్తాడు మురారి. ఇక్కడే కంపనీ గెస్ట్ హౌస్ ఉంది.. ఇక్కడ కార్ రిపేర్ అయ్యేలోపు అక్కడకి వెళ్దామని కృష్ణని తీసుకెళ్తాడు మురారి.

మరోవైపు ముకుంద ఇంటికి వెళ్తుంది. అక్కడ భవానీతో మాట్లాడుతుంది. మురారీతో కృష్ణ ఏదో పర్సనల్ గా మాట్లాడాలంట అందుకే నన్ను మధ్యలో దింపేసి వాళ్ళు వెళ్ళారని భవానీతో ముకుంద అనగానే.. "ఏంటి ఈ కృష్ణ.. ఏం ప్లాన్ చేస్తుంది" అని భవాని తన మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.