Read more!

English | Telugu

గౌతమ్ నందుల పెళ్ళి కోసం కృష్ణ తపన..  ఆ పెళ్ళిని ఆపినట్టేనా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-138 లో.. నందు గౌతమ్ ల పెళ్ళి గురించి కృష్ణ తీవ్రంగా ఆలోచిస్తుంటుంది. ప్రయత్నాలని ఆపేయమంటుంది రేవతి.‌ వదిలేయ్ కృష్ణ.. నా దురదృష్టం ఇంతే అని గౌతమ్ అంటాడు. లేదు గౌతమ్ సర్.. మురారి మాటిచ్చాడు..‌ నెరవేరుస్తాడని కృష్ణ అంటుంది. అటు పెద్దమ్మ, ఇటు నేను.. ఒక పక్క న్యాయం, మరోవైపు అన్యాయం.. ఏసీపీ సర్ న్యాయం వైపే మొగ్గు చూపుతాడని కృష్ణ అనగా.. కానీ అటు వైపు నుండి నీకేం సాయం రాదు.. ఎందుకంటే భవానీ అలా పెంచింది మురారిని అని రేవతి అంటుంది. దయచేసి మా నందినిని మర్చిపో.. కృష్ణ బాగుండాలంటే ఈ పెళ్ళి ఆపాలని చెప్పమని గౌతమ్ తో రేవతి అంటుంది. ఆఖరి నిమిషం దాకా వెనుకడుగువేయమని కృష్ణ అంటుంది. ఏయ్ వినిపిస్తుందా.. భవాని సొంత కూతురినే పిచ్చి దాన్ని చేసింది.. నిన్ను వదిలేస్తుందా అని బెదిరిస్తుంది రేవతి. దయచేసి నన్ను వెనక్కి లాగొద్దని కృష్ణ అంటుంది.

మరోవైపు కళ్యాణమండపంలో నందిని పెళ్ళి పనులు జరుగుతుంటాయి. పదండి మీ ఇంటికి వెళ్దామని గౌతమ్ అనగా... నేను రానని కృష్ణ అంటుంది. నీ కాపురం కూలిపోతుంటే చూడలేనని గౌతమ్ అంటాడు. అప్పుడే కృష్ణకి కాల్ వస్తుంది. నన్ను డ్రాప్ చేయమని గౌతమ్ ని కృష్ణ అంటుంది.  మరోవైపు పెళ్లి జరుగుతుండగా మురారి అదోలా ఉండటం చూసిన భవాని.. నువ్వు దగ్గరుండి చూసుకోవాలని మురారికి చెప్తుంది భవాని. ఆ తర్వాత పెళ్ళి కొడుకు దగ్గరికి మురారి వెళ్ళగా.. అక్కడికి వెళ్ళి పెళ్ళి కొడుకతో ఏమైనా కావాలా అని అడుగగా.. మీ చెల్లికి మరీ పిచ్చి ఎక్కువుందని అంటాడు. మా చెల్లి గురించి ఇంకోసారి తప్పుగా మాట్లాడకండని పెళ్ళికొడుకుకి మురారి గట్టిగా చెప్తాడు. ఇంట్లో ఉన్న రేవతి.. నందిని పెళ్ళి గౌతమ్ తో జరగాలి.. నా కోడలు కృష్ణ గెలవాలని దేవుడిని వేడుకుంటుంది. మరోవైపు పెళ్ళి తంతు జరుగుతుంటుంది. 

మురారి బాధపడుతూ ఏడుస్తుండటం చూసిన భవాని.. చెల్లెలు పెళ్ళి చేసుకొని అమెరికాకి వెళ్ళిపోతుందని బాధపడుతున్నావా మురారి.. ఏదేమైనా నాకిచ్చిన మాట నిలబెట్టుకున్నావ్ మురారి.. ఈ పెళ్ళి నీ చేతులమీదుగా జరిపిస్తున్నావు.. చాలా సంతోషంగా ఉందని భవాని అంటుంది. మరోవైపు గౌతమ్, కృష్ణలు చాలా వేగంగా కళ్యాణమండపానికి కార్ లో వస్తుంటారు. కళ్యాణమండపానికి వచ్చి, బయటనే ఆగి గౌతమ్ టెన్షన్ పడుతుంటాడు. ఏమైందని కృష్ణ అడుగగా.. నాకేమైనా పర్లేదు.. నీ కాపురం బాగుండాలని గౌతమ్ అంటాడు. నా కాపురం ఏమైనా పర్లేదు.‌. నన్ను ఇంట్లోంచి గెంటేసినా పర్లేదు కానీ మీ ఇద్దరి పెళ్ళి నేను జరిపిస్తానని కృష్ణ అంటుంది. అంతలో వాళ్ళిద్దరి దగ్గరికి ముకుంద వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.