Read more!

English | Telugu

కార్తికేయ సాంగ్ కి కోటి ఫిదా..బొమ్మ బ్లాక్ బస్టర్ పెర్ఫార్మర్ గా వైష్ణవి

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 "కోటిస్ ఉగాది ఛాలెంజ్" ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో హోస్ట్ హేమచంద్ర స్వర కిరీటి డాక్టర్ కోటి గారు అని చెప్తూ స్టేజి మీదకు ఇన్వైట్ చేసాడు. "ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం..ఒక్కోదానికి ఒక్కో టేస్ట్ ఉంటుంది చూద్దాం వీళ్లెలా పెర్ఫార్మ్ చేస్తారో" అన్నారు కోటి. ఇక యంగ్స్టర్ కార్తికేయ వచ్చి "పదహారేళ్ళ వయసు..పడి పడి లేచే మనసు" సాంగ్ పాడి వినిపించాడు. "30 ఇయర్ ఓల్డ్ సాంగ్ పాడావ్..ఐనా చాలా ఫ్రెష్ గా ఉంది నీ వాయిస్" అంటూ థమన్ కాంప్లిమెంట్ ఇచ్చారు. కార్తికేయ పాడిన సాంగ్ ని అందరూ ఎంజాయ్ చేశారు. కోటి ఫ్లైయింగ్ కిసెస్ ఇచ్చేసారు. "కార్తికేయ ఈజ్ ఏ రాక్ స్టార్..నేను వాడి ఫ్యాన్ సర్" అంటూ జడ్జి కార్తీక్ కాంప్లిమెంట్ ఇచ్చేసాడు. ఇక కోటి తన సీట్ లోంచి లేచి స్టేజి మీదకు వెళ్లి కార్తికేయను విష్ చేయడమే కాదు ఇద్దరూ కలిసి మంచి ఊపున్న పాటను హేమచంద్ర పాడుతూ ఉంటే వాళ్ళు మ్యూజిక్ ఇచ్చారు. ఇక కార్తికేయ గిటార్ మీద "విత్ లవ్ ఫ్రమ్ కోటి" అని సైన్ చేసి ఇచ్చారు. తర్వాత మరో సింగర్ వైష్ణవి వచ్చి "నడక కలిసిన" సాంగ్ కి మేల్ అండ్ ఫీమేల్ వాయిస్ తో పాడి అందరినీ మెస్మోరైజ్ చేసేసింది.

"వైష్ణవి అదరగొట్టేశావ్ అంతే" అంది గీతామాధురి. "మధ్యలో మేల్ వాయిస్ వినిపించేసరికి ఎవరు పాడారా" అని చూస్తున్నాను అన్నారు కోటి. ఈమె సింగింగ్ పెర్ఫార్మెన్స్ బొమ్మ బ్లాక్ బస్టర్ అన్నారు జడ్జెస్. ఇక ఫైనల్ గా సాకేత్ వచ్చి "ఇదేలే తరతరాల చరితం" సాంగ్ ని పాడి వినిపించాడు. ఆ సాంగ్ విన్న కోటి స్టేజి మీదకు వెళ్లి "ఈ సాంగ్ నేనే కంపోజ్ చేసానా అని నాకే అనుమానమొచ్చింది నువ్వు పాడుతుంటే" అన్నారు. తర్వాత జడ్జి కార్తీక్ అందరికీ ఒక టాస్క్ ఇచ్చాడు. "సర్ కోటి గారు మీరు కీ-బోర్డు, థమన్ నువ్వు డ్రమ్స్ వాయించు" అని చెప్పాడు. "స..ని..ద..ప..మ..గ.." అని కార్తీక్, సాకేత్ పాడారు. ఇలా ఈ వారం ఎపిసోడ్ ఎంటర్టైన్ చేయడానికి ఆడియన్స్ ముందుకు వచ్చేస్తోంది.