Read more!

English | Telugu

హోటల్ నుండి స్వప్న తప్పించుకోవడంతో నిరాశచెందిన రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-62 లో.. స్వప్న ఉన్న హోటల్ దగ్గరికి SI,  రాజ్ వస్తారు. అప్పుడే అక్కడికి కనకం వాళ్ళ అక్క, కనకం వేరే కార్లో వచ్చి రాజ్ ని చూసి దాక్కుంటారు.

SI, రాజ్ లని దూరం నుండి చూసిన రాహుల్ వెంటనే ఈ విషయం స్వప్నకి కాల్ చేసి చెప్తాడు. దాంతో స్వప్న లగేజ్ మొత్తం సర్దుకొని.. హోటల్ లోని వెనకాల వైపు దాక్కుంటుంది. స్వప్నని వెతుక్కుంటూ SI, రాజ్ లు వస్తారు. హోటల్ రిసెప్షన్ లో రిజిస్టర్ చూస్తుండగా.. మేనేజర్ వచ్చి స్వప్న 207 రూంలో ఉందని చెప్తాడు. దాంతో ఇద్దరు పరుగున ఆ రూం దగ్గరికి వెళ్ళగా.‌‌. అంతలోనే స్వప్న అదే ఫ్లోర్ లో బిల్డింగ్ వెనకాల వైపు దాక్కుంటుంది. వాళ్ళు ఎంతవెతికినా కనిపించదు. దాంతో రాజ్ సీసీటీవి రూంకి మేనేజర్ ని తీసుకొని వెళ్ళి  చెక్ చేయగా.. టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఈ రోజు డాటా తప్ప ఏమీ లేదు అంతా పోయిందని అక్కడ సీసీటీవి మానిటర్ చేసే వ్యక్తి చెప్తాడు. దాంతో మేనేజర్ అతడిని తిడతాడు. స్వప్న మళ్ళీ పారిపోయిందని అనుకుంటాడు. అదే సమయంలో రిసెప్షన్ దగ్గరికి కావ్య వస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మేనేజర్ స్వప్న నాకు గుండు చేసి పారిపోయిందని చెప్పగా కావ్య షాక్ అవుతుంది. సీసీటీవి రూం నుండి బయటకు వచ్చిన రాజ్ ..రిసెప్షన్ దగ్గర ఉన్న కావ్యని చూసి తనని చేయి పట్టుకొని లాక్కొని కార్ లో తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత స్వప్నని వెతుక్కుంటూ కనకం వాళ్ళ అక్క, కనకం రాగా.. స్వప్న తన రూం బిల్ కట్టలేదని చెప్పి వారి దగ్గర మేనేజర్ డబ్బులు తీసుకుంటాడు.

హోటల్ బయట కార్ లో ఉన్న రాహుల్.. ఆ హోటల్ సీసీటీవి మానిటర్ చేసే వ్యక్తికి కాల్ చేసి.. నేను చెప్పి‌న పని అయిపోయిందా అని అడుగగా.. అయిపోయింది సర్ అని అతను అంటాడు. నీ అకౌంట్ లో కాసేపట్లో డబ్బులు క్రెడిట్ అవుతాయి చూసుకోమని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇక్కడే ఉంటే ప్రాబ్లం అవుతుందని అనుకొని ఇంటికొస్తాడు రాహుల్. అప్పుడే కావ్యని చేతితో లాక్కొచ్చి పడేస్తాడు రాజ్. ఆ తర్వాత అందరూ ఏమైందని రాజ్ ని అడుగగా‌.. కావ్యని ఇష్టమొచ్చినట్టు మాటలు అంటాడు. మీ కుటుంబం అంతా మాయ చేస్తూనే ఉంటారు.. మోసం చేస్తూనే ఉంటారా.. ఇలా నటిస్తూనే ఉంటారా అని కావ్యని రాజ్ అనగా.‌. అసలు ఏం అయిందని కావ్య అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.