Read more!

English | Telugu

వాళ్ళను చూస్తుంటే నా స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి

ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో కొన్ని పేర్లకు అస్సలు పరిచయాలే అక్కరలేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చూసినా కాంట్రావర్సీస్ తో ఆడియన్స్ కి, ఫాన్స్ కి బాగా కనెక్ట్ ఐపోతారు. అలాంటి వాళ్ళ లిస్ట్ లో ఆర్జీవీ, కౌశల్ మందా ఇద్దరూ టాప్ ప్లేస్ ఉంటారు. కౌశల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బిగ్ బాస్ 2 లో ఆయన కోసం కౌశల్ ఆర్మీ కూడా ఒకటి స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు కౌశల్ బీబీ జోడిలో అభినయశ్రీతో కలిసి జోడి డాన్సర్ గా కాంటెస్ట్ చేస్తున్నాడు. ఈ షోలో కూడా ఫుల్ కాంట్రవర్సీతో సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారిపోయాడు కౌశల్. ఇతను ఎక్కడ ఉంటే అక్కడ గొడవలే ఉంటాయి.  ఈయన సోషల్ మీడియాలో ఈమధ్య ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నాడు. 

ఐతే రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ పెట్టాడు. తన కూతురు పాలు చేతిలో పట్టుకుని, స్కూల్ డ్రెస్ వేసుకుని కుర్చీలో నిద్రపోతూ ఉంది..మరో వైపు కారులో తన కొడుకు కూడా సీట్ లో కూర్చుని నిద్ర పోతూ కనిపించాడు. ఎయిర్ రెండిటిని మిక్స్ చేసి ఒక వీడియోగా తన పేజీ లో పోస్ట్ చేసాడు. "నా పిల్లలు ఇలా చూస్తుంటే నా స్కూల్ డేస్ మళ్ళీ నాకు గుర్తొస్తున్నాయి. ప్రతీ రోజు మా అమ్మకు మమ్మల్ని స్కూల్ కి పంపించడం అనేది పెద్ద ఛాలెంజ్" అని కాప్షన్ పెట్టాడు. ఈ వీడియో నెటిజన్స్ అందరికి బాగా కనెక్ట్ ఐపోయింది. "ఈరోజుల్లో పిల్లలకు స్కూల్ కష్టాలు చాలా ఉన్నాయి. 9 గంటలకల్లా స్కూల్ కి వెళ్ళాలి అంటే 8 కల్లా లేవాల్సిన తయారు కావాల్సిన పరిస్థితి..చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. నా చిన్నప్పుడు నేను స్కూల్ కి 9 .30 కి వెళ్ళేవాడిని"..."పిల్లలకు సరిగా నిద్రలేక ఇబ్బందులు పడుతున్నారు...ఏదైనా అప్పటి రోజులు గోల్డెన్ డేస్" అంటూ రిప్లైస్ ఇస్తున్నారు.