Read more!

English | Telugu

Karthika Deepam2  : ఉగాది పోటీలో గెలిచేదెవరు.. దీపని నరసింహా కనుక్కుంటాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '.. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -17 లో... నర్సింహా డ్రింక్ చేస్తు దీప గురించి ఆలోచిస్తుంటాడు. దీప కార్తీక్ తో కార్ లో వెళ్ళిన విషయాన్నే.. పదేపదే గుర్తుకుచేసుకొని నరసింహా కోపంగా ఉంటాడు. అప్పుడే అతని రెండవ భార్య వచ్చి.. ఏంటి ఆ దీప కన్పించిందా అని అంటుంది. దాంతో నరసింహా ఇంకా కోపంగా ఉంటాడు. పండక్కి కూడా పాత మొగుడేనా అనే సామెత నిజం చేసావ్ దీప.. అసలు నువు ఇచ్చిన షాక్ తెల్లవార్లు తాగినా తప్పు లేదని నరసింహా అనుకుంటాడు.

ఆ తర్వాత రెడీ అయి కార్తీక్ కిందకి వస్తుంటే.. అప్పుడే కార్తీక్ దగ్గరికి జ్యోత్స్న వెళ్తుంది. ఎంగేజ్ మెంట్ చేసుకొని పెళ్లి చేసుకోవాలా లేక డైరెక్ట్ పెళ్లి చేసుకోవచ్చా అని జ్యోత్స్న అడుగుతుంది. ఎంగేజ్ మెంట్ లేకుండా కూడా పెళ్లి చేసుకోవచ్చని కార్తీక్ అనగానే.. ఆ మాట వాళ్ల నాన్న విని మీరు ఇంత ఫాస్ట్ ఉన్నారేంటని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక్కడ అంత లేదని కార్తీక్ అంటూ ఉంటాడు. ఆ తర్వాత జరగాల్సింది అదే కదా బావ అని జ్యోత్స్న చెప్పి వెళ్ళిపోతుంది. ఇక్కడేం జరిగిందో అతనికి తెలియదు.. నేనేం అనుకుంటున్నానో నీకు తెలియదు.. ఎవరికి వారే వాళ్ల స్క్రిప్ట్ రాసుకుంటున్నారని కార్తీక్ అనుకుంటాడు. అసలు ఇంతవరకు జ్యోత్స్న అంటే ఇష్టం లేదని పారు ఎందుకు చెప్పలేదు? తనని అడగాలని కార్తిక్ అనుకుంటాడు. ఆ తర్వాత అందరు కిందకి వస్తారు‌. నేను వెళ్లి దీపకు బట్టలు ఇచ్చి వస్తానని సుమిత్ర, జ్యోత్స్న ఇద్దరు వెళ్తారు. మరొకవైపు దీప తను తీసుకున్న బట్టలు వెయ్యాలని శౌర్యని పిలుస్తుంది. అప్పుడే సుమిత్ర తను తీసుకొని వచ్చిన బట్టలు ఇచ్చి రెడీ అయి ఇంటికి రమ్మని చెప్తుంది.

మరొకవైపు నర్సింహా భార్య ఉగాది పచ్చడి తీసుకొని వచ్చి.. అతని ముందు పెడుతుంది. ప్రేమగా తినిపించే దానివని నర్సింహా అనగానే.. నువ్వు ఆ దీపతో విడాకులు తీసుకుంటేనే? లేదంటే నీ మొహం కేసి కొడుతానని తను అంటుంది. ఆ తర్వాత అసలు దీప నువ్వు నాకోసం వచ్చావా? వాడెవడు? నువ్వు ఎక్కడున్నా నిన్ను కనిపెడతానని నర్సింహా అనుకుంటాడు. మరొకవైపు ఇంట్లో అందరు దీప, శౌర్యలతో సరదాగా మాట్లాడుతారు. అందరికి ఒక పోటీ పెడుతారు. ఉత్తమ ఉగాది పచ్చడి పోటీలో జడ్జిగా దీప ఉండాలి. దీప ఎవరు చెప్తే వాళ్ళకి ఈ గోల్డ్ చైన్ అని శివనారాయాణ చెప్తాడు. దీపకి ఇంపార్టెన్స్ ఇవ్వడంతో పారిజాతం కుళ్ళుకుంటుంది. ఈ ఇంట్లో అందరు మంచివాళ్ళే అని దీప అనుకుంటుంది. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.