Read more!

English | Telugu

Karthika Deepam2 : ఇంట్లో నుండి వెళ్లిపోయిన దీప.. తనని వెతుక్కుంటూ వచ్చిన పోలీసులు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -33 లో... దీపని ఎలాగైనా ఇంట్లో నుండి పంపించాలని పారిజాతం తన దగ్గరికి వస్తుంది. కొంత డబ్బు ఇచ్చి ఇంట్లో నుండి వెళ్ళమని చెప్తుంది. పాపం సుమిత్ర తన కూతురిని చూస్తూ బాధపడుతుంది. వాళ్ళు పంపిస్తేనే ఇక్కడకి వచ్చానని  పారిజాతం అంటుంది. నువు ఇంత జరిగిన ఇక్కడ ఉంటావని అనుకోవడం లేదని దీపతో పారిజాతం అంటుంది.

ఆ తర్వాత పారిజాతం వెళ్తుంటే.. దీప పిలిచి డబ్బులు తీసుకొని వెళ్ళమని చెప్తుంది. ఎంత పొగరు దీనికి అని పారిజాతం అనుకుంటుంది. ఆ తర్వాత శౌర్య రాగానే.. మనం మన ఊరు వెళ్తున్నాం.. సైకిల్ తీసుకోని మళ్ళీ వద్దామని చెప్తుంది. ఆ తర్వాత శౌర్య మెడలో శివనారాయణ వేసిన గొలుసు తీసేసి బీరువాలో పెడుతుంది. కాసేపటికి దీపని శౌర్య తీసుకొని.. ఇంట్లో నుండి బయటకు వస్తుంది. అప్పుడే ఎదరుగా కార్తీక్ వచ్చి.. ఇంట్లో చెప్పకుండా వచ్చారా అంటు అడుగుతాడు. శౌర్యని కార్ లో కూర్చొపెట్టి దీపతో కార్తీక్ మాట్లాడతాడు. టీవీలో వచ్చిన న్యూస్ చూసాను.. దానివల్ల ఇంట్లో వాళ్ళు ఏమైనా అన్నారా అని కార్తీక్ అడుగగా.. ఎవరేం అనలేదని దీప చెప్తుంది. మరి నాన్న గురించి శౌర్య అడిగితే.. ఏం సమాధానం చెప్తారని కార్తీక్ అడుగుతాడు. ఆ నీచుడి గురించి చెప్పేకంటే చనిపోయాడని చెప్తానని దీప అంటుంది.

ఆ తర్వాత ఇప్పటికైనా చేసిన మంచి చాలు నన్ను వెళ్లనివ్వండని దీప అంటుంది. ఎక్కడికి వెళ్తారు ఊళ్ళో.. ఆ మల్లేష్ గొడవ పెడుతున్నాడు కదా.. ఆ రోజు నీ అడ్రస్ కోసం వాన్ని అడిగాను.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు.. అందుకే ఒక్కటిచ్చానని కార్తీక్ అనగానే.. మల్లేష్ అన్న మాటలు దీప గుర్తుకుచేసుకుని మీ వల్లే నాకు ఈ సిచువేషన్ వచ్చింది. మీరు కొట్టడం వల్లే వాడికి కోపం వచ్చింది.. లేదంటే ఎప్పటిలాగే ఏదో ఒకటి రిక్వెస్ట్ చేసేదాన్ని అని దీప అంటుంది. నన్ను వెళ్లనివ్వండి అంటూ శౌర్యని తీసుకొని దీప వెళ్తుంది. ఇప్పుడు నిన్ను ఆపే హక్కు నాకు లేదు దీప అని కార్తీక్ మనసులో అనుకుంటాడు. మరొకవైపు పోలీసులు సుమిత్రని కొట్టిన అతను ఇతనేనా అంటూ ఒక అతన్ని తీసుకొని వస్తారు. దీపని పిలవండి అనగానే.. దీప కోసం తను ఉండే గదిలోకి జ్యోత్స్న వెళ్లి చూడగా.. అక్కడ గొలుసు మాత్రమే ఉంటుంది. అది తీసుకొని వచ్చి దీప లేదు వెళ్ళిపోయిందని జ్యోత్స్న చెప్తుంది. మీరు కావాలనే దీపని పంపించారు.. జ్యోత్స్న కేసు.. సుమిత్ర దాడి కేసు.. రెండు నాకు అప్పగించారు. రెండింటిలో ప్రధాన సాక్ష్యం దీప. ఒక కేసు వల్ల మీకు లాభమని దీపని ఇంట్లో ఉంచుకున్నారు.. ఇంకొక కేసులో దీప ఇక్కడ ఉండడం ప్రాబ్లమ్ అని పంపించారని ఇన్‌స్పెక్టర్ అంటుంటే.. అప్పుడే కార్తీక్ వచ్చి వాళ్ళు పంపించలేదు.. దీపను నేను తీసుకొని వస్తానంటూ కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే ‌