Read more!

English | Telugu

Karthika Deepam2 : ఆమెకు డబ్బు ఆఫర్ చేసిన పారిజాతం.. తను‌ ఒప్పుకోగలదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'.. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -32 లో.. జ్యోత్స్న చేసిన పనికి బాధపడుతుంటే.. శౌర్య వచ్చి ఎందుకు బాధపడుతున్నావని ఆడుగుతుంది.. ఆ తర్వాత న్యూస్ లో జ్యోత్స్న గురించి చెప్తుంటారు.. మిస్ హైదరాబాద్ కిరీటాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు న్యూస్ లో చెప్పడం విన్న జ్యోత్స్న ఆవేశంగా లోపలకి వెళ్తుంది. తన వెంటే సుమిత్ర , పారిజాతం వెళ్తారు. అంత ఆ దీప.. నేను తప్పు చేసానని చెప్పడం వల్లేనని జ్యోత్స్న అంటుంటే.. ఇందులో దీప తప్పేంటని సుమిత్ర అంటుంది.  నువ్వు ఆ దీపకే సపోర్ట్ అని తెలుసంటు జ్యోత్స్న కోప్పడుతుంది..

ఆ తర్వాత ఇన్ని రోజులు సంపాదించుకున్న పేరు మొత్తం పోయింది. నా ఫాలోవర్స్ కి నేనేం సమాధానం చెప్పాలంటూ జ్యోత్స్న ఎమోషనల్ అవుతుంటుంది. సుమిత్ర నచ్చిజెప్పే ప్రయత్నం చేస్తుంది. దీనికి అంతటికి కారణం ఆ దీప.. ఒక్క సాక్ష్యంతో నా జీవితాన్ని మార్చేసిందని జ్యోత్స్న అనుకుంటుంది.. ఆ తర్వాత నేను ఇక్కడే చదువుకుంటానని శౌర్యకి చెప్తుంది.. ఆ తర్వాత దీప దగ్గరికి పారిజాతం వచ్చి.. నీ వల్లే ఇదంతా నా మనవరాలు మిస్ హైదరాబాద్ కిరీటం గెల్చుకుంది. అది ఇప్పుడు నీ వల్ల వెనక్కి తీసుకన్నారు.. నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదంటూ నెట్టేస్తుంది. లోపలికి వెళ్లి తన బ్యాగ్ తీసుకొని వచ్చి బయటకు పడేస్తుంది పారిజాతం. అప్పుడే సుమిత్ర వచ్చి ఆపుతుంది. నువ్వు అడ్డు రాకు అని పారిజాతం అంటుంది. తప్పు చేసింది జ్య దీప కాదు అంటూ సుమిత్ర దీప కి సపోర్ట్ చేస్తుంది. ఉండాలా? వెళ్లిపోవాలా అని దీప ఆలోచనలో పడుతుంది. ఆ తర్వాత బంటూ వచ్చి. ఆ దీప ని పంపించేసారా అని అడుగుతాడు.. సుమిత్ర అడ్డు రాకుంటే అదే జరిగేదని పారిజాతం అంటుంది.. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. దానివల్ల దీప వెళ్ళిపోతుందని ఆ ప్లాన్ పారిజాతానికి బంటు చెప్తాడు.

ఆ తర్వాత ఆ ప్లాన్ ఇప్పుడు అమలు చెయ్యండని పారిజాతానికి‌ బంటు పంపిస్తడు. దీప దగ్గరకి పారిజాతం వస్తుంది. ఇప్పుడు ఎందుకూ వచ్చారని దీప అడుగుతుంది. ఇదిగో డబ్బులు సుమిత్రని కాపాడినందుకని దీపతో పారిజాతం చెప్తుంది.. ఇంట్లో వాళ్ళే నన్ను పంపించారు.. నీకు సుమిత్ర పైన ఏ మాత్రం అభిమానం ఉన్నా.. ఈ డబ్బులు తీసుకొని వెళ్ళు ఇంకెప్పుడు రాకని పారిజాతం అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.