Read more!

English | Telugu

Karthika Deepam2 : అసభ్యంగా మాట్లాటిన భర్త మీదకి చెప్పులేపిన భార్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -19 లో.. దీప గుడికి వెళ్తుంది. మాకు అన్యాయం చేసిన వాళ్ళు నాకు కనపడకుండా ఉండాలని మొక్కుకుంటుంది. అలా ఉండాలంటే ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని దీప అనుకుంటుంది. అప్పుడే కార్తీక్ కూడ గుడికి వచ్చి.. దీప నన్ను క్షమించాలని మొక్కుకుంటాడు. ఆ తర్వాత దీప బయటకు వస్తుంది. అప్పుడే తన భర్త నర్సింహా చూసి.. ఇంకా ఇక్కడే ఉన్నావా? ఊరు వెళ్లలేదా అని అడుగుతాడు.

ఆ తర్వాత దీప సమాధానం చెప్పకుండా వెళ్లిపోతుంటే.. కొంగు పట్టి లాగుతాడు. అపుడే కార్తీక్ వచ్చి నరసింహ చెంపపై ఒక్కటేస్తాడు. ఎవడు రా నువ్వు అని నరసింహని కార్తిక్ అడుగుతాడు... చెప్పే.. నీ మొగుడిని అని  చెప్పవే అని దీపతో నరసింహా.. అనగానే నర్సింహా కాలర్ వదిలేస్తాడు కార్తిక్. మొగుడిని కొట్టించేంత బరితెగించావా.. కూతురిని ఏసుకొని వీడితో షాపింగ్ కి తిరుగుతున్నావా.. వెళ్ళవే అంటే ఊరికి వెళ్తావనుకున్నా కానీ ఇలా డబ్బున్న వాన్ని పట్టుకొని తిరుగుతావనుకులేదు.. మర్యాద గా ఊరికు వెళ్ళిపోమని దీపకి నరసింహా వార్నింగ్ ఇస్తాడు. దాంతో నర్సింహాపై చెప్పు లేపుతుంది దీప. ఇంకొకమాట మాట్లాడితే మర్యాదగా ఉండదంటూ దీప చెప్పగానే.. నర్సింహా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కార్తీక్ అలాగే షాకింగ్ గా చూస్తాడు. మరొక వైపు సుమిత్ర పాయసం చేసి శౌర్యకు, దశరత్ కు ఇస్తుంది. అది తిన్న శౌర్య.. బాలేదని చెప్తుంది. మా అమ్మ ఇంతకన్నా బాగా చేస్తుందని శౌర్య అనగానే.. అసలు మీ అమ్మ ఏం చేస్తుందని సుమిత్ర అడుగుతుంది. ఊళ్ళో వాళ్ళకి టిఫిన్ చేసి సైకిల్ పై తీసుకొని వెళ్లి ఇస్తుందని శౌర్య చెప్తుంది. అలా తను అనగానే సుమిత్ర బాధపడుతుంది. దీపపై జాలి చుపిస్తుంది. నువ్వు ఇక్కడే స్కూల్ లో చదువుకోమని శౌర్యతో సుమిత్ర చెప్తుంది.

ఆ తర్వాత దీప దారి మర్చిపోతే కార్తీక్ వచ్చి తీసుకొని వెళ్తానంటాడు. కానీ దీప వెళ్ళదు. వేరే వాళ్ళు వెళ్ళు అమ్మ.. అతను కూడ అక్కడికే వెళ్తాన్నాడనగానే కార్తీక్ తో దీప వెళ్తుంది. మరొకవైపు జ్యోత్స్న బర్త్డే కి కాంచన నగలు డిజైన్ సుమిత్రకి పంపిస్తుంది. అవి జ్యోత్స్న కి చూపిస్తుంది. దీంతో పాటు నా కొడలిని మా ఇంటికి ఎప్పుడు పంపిస్తున్నారని కాంచన అడుగుతుందని సుమిత్ర చెప్పగానే.. ఇక పెళ్లి చేసేద్దామని ఇంట్లో వాళ్ళు అనుకుంటారు. అపుడే  దీపని కార్తిక్ తీసుకొని రావడం పారిజాతం చూస్తుంది. దీప మీద మరింత కోపం పెంచుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.