English | Telugu

బూచోడిని చూసి భయపడ్డ శౌర్య.. వాడే మీ నాన్న!

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -107 లో......కార్తీక్, జ్యోత్స్నల ఎంగేజ్ మెంట్ కి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇద్దరు పక్క పక్కన కూర్చొని ఉంటారు. అప్పుడే పారిజాతం వచ్చి నువ్వు అనుకున్నది ఆపాలని చూసావ్.. నేను జరగాలని చూసాను.. నాదే గెలిచింది.. నా అనుభవం ముందు నీ ఆవేశం ఎంత అని పారిజాతం అంటుంది. నేను తగ్గింది గెలవడం కోసమేనని కార్తీక్ అంటారు. ఏంటి మనవడితో ఏదో మాట్లాడుతున్నావంటూ శ్రీధర్ అంటాడు. ఏం లేదు నాకు వీడిని ఇలా చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదని పారిజాతం అంటుంది.

ఆ తర్వాత శౌర్య, కార్తీక్ దగ్గరికి వచ్చి.. నేను నీ దగ్గర కూర్చుంటానని అంటుంటే వద్దని దీప పిలుస్తుంది. పర్లేదు కూర్చోమను అని  కార్తిక్ అంటే.. ఇదేం గెట్ టూ గెదర్ కాదు అందరు కలిసి కూర్చొవడానికి ఇక్కడ మనం ఇద్దరమే కూర్చోవాలని జ్యోత్స్న అంటుంది. దాంతో సుమిత్ర శౌర్యని పిలిచి తన ఒళ్ళో కూర్చో పెట్టుకుంటుంది. ఆ తర్వాత కార్తీక్ దీప వంక చూస్తుంటే.. నువ్వు ఇక్కడున్నావ్ నీ మనసు ఎక్కడో ఉందని జ్యోత్స్న అంటుంది. కొన్నిచోట్ల మనిషి ఉంటే చాలు మనసుతో పని లేదని కార్తీక్ అంటాడు. నాకు మనసు కూడా కావాలని జ్యోత్స్న అంటుంది. ఇది రెండో పెళ్లి అని జ్యోత్స్న అనగానే.. కార్తీక్ షాక్ అవుతాడు. అంటే నేను పుట్టక ముందే నన్ను పెళ్ళాన్ని చేసుకున్నావ్ కదా ఇది రెండవసారి అంటున్నా అని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత ఏంటి అమ్మ ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నావని దీపతో శౌర్య అంటుంది. ఆ తర్వాత ఇరు కుటుంబాలు తాంబులాలు మార్చుకుంటుంటే.. అప్పుడే నర్సింహా వస్తాడు. నర్సింహాని చూసి బూచోడని శౌర్యా అరుస్తుంది. దంతో తాంబులాలు మార్చుకోకుండా ఆగుతారు. ఎందుకు వచ్చావని దీప అడుగుతుంది. నరసింహాతో పాటు అనసూయ కూడా వస్తుంది. నా కొడుకు బిడ్డని తీసుకొని వెళ్ళడానికి వచ్చానని అనసూయ అంటుంది.

ఆ తర్వాత అందరూ వద్దని అంటారు. మీరందరు కలిసి కార్తీక్ అన్న మాట నిజం చేసేలా ఉన్నారని నరసింహా అనగానే.. ఏం అన్నాడని అడుగుతారు. శౌర్యకి తండ్రి అతనేనట అని నరసింహా అనగానే.. అందరు షాక్ అవుతారు. కార్తీక్ నువ్వు అన్నావా అని ఇంట్లో వాళ్ళు అడుగగా.. అన్నానని చెప్తాడు. ఆ తర్వాత నా మనవరలు ఎక్కడ అంటూ అనసూయ.. శౌర్య పైన దాక్కొని ఉన్నా శౌర్యా దగ్గరికి వెళ్తుంది. నానమ్మ అంటూ అనసూయ దగ్గరకి వస్తుంది శౌర్య. మీ నాన్న అని అంటావ్ కదా తీసుకోని వచ్చానంటూ కిందకి తీసుకొని వెళ్తుంది. ఆమ్మో బూచోడు అని శౌర్య భయపడుతుంటే.. బూచోడు కాదు అతనే మీ నాన్న అని అనసూయ చెప్పగానే.. శౌర్య ఏడుస్తూ‌.. బూచోడు మా నాన్న కాదంటూ దీప దగ్గరకి వెళ్తుంది. బూచోడు నాన్ననా అమ్మ అని దీపని శౌర్య అడుగుతుంది. అడుగుతుందిగా చెప్పమని అందరు అనగానే.. వాడే మీ నాన్న అని దీప అంటుంది. దాంతో శౌర్య షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.