English | Telugu

Karthika Deepam2 : ఎంగేజ్ మెంట్ గురించి కార్తిక్ ఏం చెప్పనున్నాడు.. దీప, జ్యోత్స్నల టెన్షన్!

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -105 లో..... నీతో మాట్లాడాలని దీపతో జ్యోత్స్న అంటుంది. నువ్వు ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయావ్.. మళ్ళీ ఎవరు పిలవకుండా ఎందుకు వచ్చావని జ్యోత్స్న అడుగుతుంది. బావనా బావ కాదు నా భర్త.. చిన్నప్పటి నుండి నా బావతో ఎలా ఉండాలో కలల కన్నాను.. దాన్ని ఎవరో వచ్చి కూల్చేస్తానంటే నేను చూస్తూ ఊరుకోనని దీపతో జ్యోత్స్న అంటుంది.

నీతో ఎవరు చెప్పారో.. అదంతా వాళ్ళకి నాపై ఉన్న కోపం, ద్వేషంతో అలా చెప్పారు. నేను కేవలం నీ ఎంగేజ్ మెంట్ చూడడానికే వచ్చానని దీప చెప్తుంది. ఒకవేళ బావతో నా పెళ్లి జరగకుంటే ఈ జ్యోత్స్న బ్రతకదని చెప్పి తను వెళ్లిపోతుంది. కార్తీక్ బాబుకి జ్యోత్స్న అంటే ఇష్టం లేదు.. జ్యోత్స్న ఇలా మాట్లాడుతుంది. ఈ ఎంగేజ్ మెంట్ ఇష్టం లేదని కార్తీక్ బాబు చెప్తే.. హాస్పిటల్ లో తను అన్నమాట వీళ్ళకి తెలిస్తే ఎలా.. అందుకే వద్దని అంటున్నారని అనుకుంటారు. అప్పుడు నా పరిస్థితేంటి ? నా బిడ్డ పరిస్థితేంటి? ఇప్పుడు నేనేం చెయ్యాలి.. కార్తీక్ బాబు ఏం నిర్ణయం తీసుకుంటారోనని దీప కంగారు పడుతుంది. మరొకవైపు కార్తీక్ శ్రీధర్ చేసిన మోసం గుర్తుకు చేసుకుంటాడు. అప్పుడే కాంచన భోజనానికి పిలుస్తుంది. శ్రీధర్ కాంచనకి భోజనం తినిపిస్తుంటే.. వద్దు నేను తినిపిస్తానని ప్లేట్ తీసుకుంటాడు. వీడికి ఏమైనా తెలిసిందా అని శ్రీధర్ అనుకుంటాడు. కార్తీక్ బాబు ఏ నిర్ణయం తీసుకుంటాడో అని దీప ఆలోచిస్తుంది. అదేవిధంగా కార్తీక్ కూడా ఆలోచిస్తుంటాడు. మరుసటి రోజు కాంచన, శ్రీధర్ లు రెడీ అయి ఎంగేజ్ మెంట్ గురించి మాట్లాడడానికి రమ్మని చెప్పారని అని అనగానే.. నేను రాను మీరు వెళ్ళండి అంటూ శ్రీధర్ వంక చూస్తుంటే.. వీడి చూపేదో తేడాగా ఉందని శ్రీధర్ అనుకుంటాడు. ఆ తర్వాత కాంచన తన డెలివరికి వెళ్లినప్పుడు.. అయిన ఆక్సిడెంట్ గురించి, అప్పుడు కార్తీక్ బాగుంటే చాలు అనుకున్నాను. ఇప్పుడు నీ పెళ్లి అయి, నా మేనకోడలు నా కోడలు అయి ఇంటికి రావాలి.. మీ పిల్లలు ఇంట్లో తిరగాలని కాంచన అనగానే.. సరే అమ్మ వస్తానని కార్తీక్ అంటాడు. అలా అనగానే అనవసరం నేనే వీడిని అపార్ధం చేసుకున్నానా.. వీడికి ఏం తెలియలేదని శ్రీధర్ అనుకుంటాడు.

ఆ తర్వాత సుమిత్ర వాళ్ళు హాల్లో మాట్లాడుకుంటు ఉంటారు‌. సన్నాయి మేళాలతో కార్తీక్ కుటుంబం సుమిత్ర ఇంటికి వస్తారు. ఇప్పుడు నా జీవితానికి సంబంధించిన విషయం చెప్పబోతున్నాను.. దీప కూడా ఉండాలని కార్తిక్ అంటాడు‌. శౌర్య వెళ్లి దీపని తీసుకొని వస్తుంది. ఏం చెప్తాడో అని ఓవైపు పారిజాతం, జ్యోత్స్న.‌ మరొకవైపు దీప టెన్షన్ పడుతుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.