Read more!

English | Telugu

మోనిత గుండె కావాలంటున్న దీప!

'కార్తీక దీపం' సీరియల్ ఇప్పుడు ఎలా ముగుస్తుందని ఆసక్తి అందరిలోనూ నెలకొంది. కాగా ఈ సీరియల్ ఇప్పుడు ఎపిసోడ్-1566లోకి అడుగు పెట్టింది. మోనితతో మాట్లాడిన హిమ అక్కడ నుండి బయల్దేరి వస్తుంది.

అంతలోనే గుడి దగ్గర కార్తీక్ కార్ కన్పించడంతో హిమ అక్కడే ఆగుతుంది. హిమ గుడి లోపలికి వస్తుండగా... దీప కింద పడిపోవడం చూస్తుంది. దీప దగ్గరకి వెళ్ళి "అమ్మా.. ఏమైంది" అని  ఏడుస్తుంది. అంతలోనే కార్తీక్ వచ్చి దీపని పైకి లేపి.. తనకి టాబ్లెట్ వేస్తాడు. కాసేపటికి దీప కళ్ళు తెరుస్తుంది.

అందరూ ఇంటికి వెళ్తుండగా.. కార్తీక్ ని పక్కకు తీసుకెళ్ళి హిమ మాట్లాడుతుంది. "మోనిత అంటీ నాకు మొత్తం చెప్పింది.  ప్లీజ్ నాన్న  ఆంటీ చెప్పిన దానికి ఒప్పుకోండి" అంటూ కార్తీక్ ని బ్రతిమిలాడుతుంది. "నీకేం తెలియదు. నువ్వు చిన్నపిల్లవి"  అని హిమతో చెప్తాడు కార్తిక్. ఆ తర్వాత అందరూ అక్కడ నుండి ఇంటికి వచ్చేస్తారు.

సౌందర్య ఒంటరిగా ఉండటం చూసి హిమ అక్కడికి వెళ్ళి తనకి తెలిసిందంతా చెప్తుంది. నాకు అంతా తెలుసు నానమ్మ "నాన్నను మోనిత ఆంటీ చెప్పిన దానికి ఒప్పుకోమని చెప్పు నానమ్మ ప్లీజ్" అని హిమ అనగానే "హేయ్ ఏంటే నువ్వు.. మోనిత ఎలాంటిదో నీకు తెలిసి కూడా అలా ఎందుకు అంటున్నావు" అని సౌందర్య అంటుంది. అయితే దీప వీళ్ళిద్దరు మాట్లాడుకునే మాటలు అన్నీ కూడా చాటుగా వింటుంది.

మోనిత నిద్ర లేచి చూస్తే తన బెడ్ తో సహా వీధిలో ఉంటుంది. ఇంకా తన చుట్టూ జనాలు ఉంటారు. నేను ఇక్కడ ఉన్నానేంటి అని అనుకునేలోపే తన దగ్గరికి దీప వస్తుంది. "నీ గుండెను నాకు ఇచ్చి నన్ను బ్రతికిస్తానని చెప్పావట కదా.. ఇప్పుడు నీ గుండెని తీసుకోవడానికి వచ్చాను" అని అంటుంది. "హేయ్ దీప నేను రోడ్డు మీద ఉన్నానేంటి" అని అడుగుతుంది. అలా అనగానే దీప అక్కడున్న జనాలతో మోనిత గురించి చెప్తుంది. "ఈవిడ పెద్ద డాక్టర్... ఈ లోకంలో ఈవిడకి ఎవరు దొరకనట్లు నా భర్త వెంట పడుతుంది. మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు" అని చెప్తుంది. దాంతో అక్కడున్న జనాలు అందరూ మోనితని తిడతారు. దీంతో కోపంతో రగిలిపోతుంది మోనిత. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.