Read more!

English | Telugu

Karthika Deepam 2 : పారిజాతాన్ని తిట్టి పోసిన కుటుంబం.. బంటు పోలీస్ స్టేషన్ కి వెళ్తాడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2 '.. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -30 లో.... పోలీసులకు నిజం చెప్పినందుకు దీప జ్యోత్స్నని క్షమించమని అడుగుతుంది. కానీ జ్యోత్స్న మాత్రం దీపని అసహ్యించుకుని వెళ్ళిపోతుంది.  దీప సాక్ష్యం చెప్పడంతో పోలీసులు జ్యోత్స్నని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళతారు. మరోవైపు స్టేషన్ ముందు మీడియా వాళ్ళు జ్యోత్స్న గురించి మాట్లాడుతుంటారు. వాళ్ళ మాటలు విని జ్యోత్స్న మరింత ఏడుస్తుంది.

మరోవైపు ఇంటి దగ్గర దీప మీద పారిజాతం అరుస్తుంది. నీ ప్రాణం కాపాడింది అన్నావ్ ఇప్పుడు నీ పరువే తీసేసింది. దీనంతటికీ కారణం దీప అని పారిజాతం ఫైర్ అవుతుంది. నిన్న ఈ టైమ్ కి కేక్ కట్ చేస్తూ సంతోషంగా ఉన్న నా మనవరాలు సంతోషంగా ఉండేది.. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉందని పారిజాతం అంటుంది. ఆపండి అత్తయ్య నా కూతురు ఇలాంటి పని చేసిందని బాధపడుతుంటే.. మీరు దీపని తిడతారేంటని సుమిత్ర అంటుంది. దీప నిజం మాత్రమే చెప్పింది.. తప్పు చేసింది నా కూతురని ఏడుస్తుంది. దీపని ఇంట్లో నుంచి గెంటేస్తే కానీ సరిపోదని పారిజాతం అరుస్తుంది.దీపని అనాల్సిన అవసరం లేదని సుమిత్ర చెప్తుంది. లాయర్ జ్యోత్స్నకి బెయిల్ తీసుకుని వస్తాడు. కార్తీక్ పోలీస్ స్టేషన్ కి వస్తాడు. తనని చూడగానే జ్యోత్స్న వెళ్ళి కౌగలించుకుని ఏడుస్తుంది. నేను విన్నది నిజమేనా అని కార్తీక్ అంటే అవునని తలాడిస్తుంది. తన ప్రమేయం లేకుండానే జరిగిందని జ్యోత్స్న చెప్పుకొని బాధపడుతుంది. మరీ అంతగా ఎందుకు తాగడమని కార్తిక్ అంటాడు. కాసేపిటకి బెయిల్ రావడంతో జ్యోత్స్నని రిలీజ్ చేస్తారు. బయట మీడియా ఉందని ఫేస్ కవర్ చేసుకోమని చెప్పి కార్తీక్ తనని తీసుకెళ్తాడు. జ్యోత్స్నని గారాబం చేసి చెడగొట్టారని పారిజాతాన్ని సుమిత్ర తిడుతుంది. ఇంటి పరువుని మీడియాలో పెట్టింది. ఇది మొత్తం పేపర్లలో వస్తుంది. తాగి తెలియకుండా కారు నడుపుతుందంటే ఏమనాలని సుమిత్ర తిడుతుంది. అనాల్సింది దీన్ని కాదు దీపని అని పారిజాతం అరుస్తుంది. జ్యోత్స్న దీప వైపు కోపంగా చూస్తుంది. ఏం జరిగిందో తెలియదని దీప ఏడుస్తుంది. తెలియనప్పుడు నోరు మూసుకుని ఉండాలని పారిజాతం అనగానే..  ఆ పని చేయాల్సింది నువ్వు అని పారిజాతం మీద శివనారాయణ ఫైర్ అవుతాడు. నీ నీడ కూడా నా మనవరాలి మీద పడకూడదని చెప్పాను ఎందుకంటే ఇలాంటి పరిస్థితి ఏదో ఒకరోజు వస్తుందని నాకు ముందే తెలుసని శివనారాయాణ అంటాడు. మరోవైపు బంటు వచ్చి పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నానని పారిజాతంతో చెప్తాడు. ఎందుకని పారిజాతం కంగారుపగా అడుగుతుంది.

సుమిత్రమ్మని చంపాలని చూసింది నేనే అని ఒప్పుకోవడానికని బంటు అంటాడు. నన్ను చంపమని చెప్పింది మీరే అని చెప్తాను. ఈ అమ్మగారిని వదిలేసి ఎక్కడికి పోతావని అంటుంది. వదిలేసి పోను నాతో పాటు మిమ్మల్ని జైలుకి తీసుకెళ్ళి పోతానని చెప్తాడు. మీ మనవరాలి కోసం నన్ను ఇరికిస్తారా? దేవతలా దీప వచ్చి కాపాడింది కాబట్టి సరిపోయింది లేదంటే పోలీసులు నన్ను తీసుకెళ్ళేవాళ్ళని అంటాడు. ఇన్నాళ్ళూ మీ పెదవుల మీద చిరునవ్వు కోసం ఎన్నో చేశాను కానీ మీరు ఇలా చేశారని తనని భయపెడతాడు. భక్తిని నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వమని అడుగుతావు కదా దాని చెక్ చేయడానికి నీకోక చిన్న పరీక్ష పెట్టానని పారిజాతం కవర్ చేస్తుంది. విశ్వాసంలో మీ నాన్న అంత గొప్పవాడివి కాదు నువ్వు అంటుంది. నాలుగు సెంటి మెంట్ డైలాగులు కొట్టి వాడి మనసు మార్చేస్తుంది. దీంతో బంటు పారు బుట్టలో పడిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.