Read more!

English | Telugu

Karthika Deepam2 : అనసూయని‌ తీసుకెళ్ళిన మల్లేష్.. ఆ దుండగుడిని దీప గుర్తుపడుతుందా!

స్టార్ మా టీవిలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '.. ఇది నవ వసంతం. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -12 లో.. సుమిత్ర, దశరథ్ లు దీపని వాళ్ళింటికి తీసుకొని వెళ్ళడానికి వాళ్ళు ఒప్పిస్తారు. ఆ తర్వాత దీప, శౌర్యలలని తీసుకొని ఇంటికి బయలుదేర్తారు. మరొకవైపు నర్సింహా రెండో భార్య నర్సింహాపై కోపంగా ఉంటుంది. నువ్వు ఆ దీపతో విడాకులు తీసుకంటేనే నేను నీతో ఉంటానని బెదిరిస్తుంది. ఇప్పుడు ఆ దీప ఎక్కడ ఉందోనని నర్సింహా అనుకుంటాడు. మరోవైపు ఇంటికి వాళ్ళు వెళ్ళగానే పారిజాతాన్ని దీపకి దిష్టి తియ్యమని సుమిత్ర చెప్తుంది. సుమిత్రని కాపాడిన దానికి దిష్టి తియ్యడమేంటని పారిజాతం ఇష్టం లేకున్నా దీపకి దిష్టితీస్తుంది.

ఆ తర్వాత సుమిత్రని కాపాడినందుకు.. అందరు దీపకు థాంక్స్ చెప్తారు. ఆ రౌడీని దీప గుర్తుపడుతుందంట ఇక్కడే కొన్ని రోజులు ఉంటుందని అనగానే పారిజాతానికి టెన్షన్ మొదలవుతుంది. కాసేపటికి ఇంట్లో అందరిని దీపకి జ్యోత్స్న పరిచయం చేస్తుంది. మా బావ వచ్చాక అతన్ని పరిచయం చేస్తానని జ్యోత్స్న చెప్తుంది. దీప ఇబ్బంది పడడం గమనించిన సుమిత్ర.. నువ్వు అవుట్ హౌస్ లో ఉండు.. నువ్వు కంఫర్ట్ గా ఉండగలవని పనిమనిషికి చెప్పి పంపిస్తుంది. ఆ తర్వాత దీప అవుట్ హౌస్ లోకి వచ్చాక.. బ్యాగ్ లో ఫోన్ చూస్తుంది కానీ కనిపించదు. ఆ తర్వాత శౌర్య  పూలమొక్కలు చూసి బయపడుతూ దీపని పిలుస్తుంది. అక్కడ పూలు కొస్తేనే కదా వాళ్ళు మనతో గొడవపడ్డారు ఇక అటువైపు కూడా వెళ్ళనని శౌర్య చెప్తుంది. సరే ఇక్కడే ఆడుకో అని దీప చెప్తుంది.

మరొకవైపు అప్పు ఇచ్చిన మల్లేష్.. దీప ఇంటికి తాళం వేసి అనసూయ కోసం చూస్తాడు. అనసూయ రాగానే మీ కోడలు వచ్చి డబ్బులు ఇస్తేనే ఈ ఇంటి తాళం ఇస్తాను.. అప్పటివరకు మా ఇంట్లో పనిచేస్తూ వడ్డీ ముట్టజెప్పుతూ ఉండమంటూ అనసూయని మల్లేష్ తీసుకొని వెళ్తాడు. మరొకవైపు దీప, శౌర్యలు అవుట్ హౌస్ నుండి సుమిత్ర దగ్గరకి వస్తారు. నాకు ఆడుకోవడానికి ఫ్రెండ్స్ ఎవరు లేరని శౌర్య అనగానే.. మేమ్ ఉన్నాము కదా మాతో ఆడుకోమని సుమిత్ర అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.