Read more!

English | Telugu

అమెరికా వెళ్ళిపోతున్న వర్ష.. అక్కి ఏడ్చేశాడుగా!

 

బుల్లితెరపై గ్లామర్ ట్రీట్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అటు జబర్దస్త్ స్టేజ్ మీద యాంకర్స్, ఇటు శ్రీదేవి డ్రామా కంపెనీలో కొంతమంది మినహా సోషల్ మీడియాలో క్రేజ్ ఉన్న యాంకర్స్ తక్కువే‌.‌ అయితే జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన వర్ష తాజాగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

జబర్దస్త్  కామెడీ షోలో ఇమ్మాన్యుయల్, వర్ష  జోడి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. వీళ్లది హిట్ పేయిర్. ఆన్‌స్క్రీన్ మీద వీళ్ల కెమిస్ట్రీ, కామెడీ బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాదు, వీళ్ల రిలేషన్‌షిప్‌పై బోలెడన్ని వార్తలొచ్చాయి. సుడిగాలి సుధీర్ - రష్మి జంట తరవాత.. జబర్దస్త్ నుంచి అంత పాపులర్ అయిన జంట ఇమ్ము-వర్ష. అయితే వర్ష సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టాడు. అందులో వీడియోలు చేస్తూ తన అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తుంది. వర్ష యూట్యూబ్ ఛానెల్ కి 4.68 లక్షల సబ్ స్క్రైబర్స్ కూడా ఉన్నారు. ఇక తను అప్లోడ్ చేసే ప్రతీ వీడియోకి అత్యధిక వీక్షకాధరణ లభిస్తోంది. కాగా తాజాగా " నేను అమెరికా వెళ్ళిపోతున్నాను.. దానికి అక్కి ఏడుస్తున్నాడు " అనే వ్లాగ్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది. అది ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

వర్ష అమెరికా వెళ్తున్నట్టు అక్కి అనే బాబుకి చెప్పగా తను ఏడ్చేశాడు. తనకిష్టమైన అక్కి ఏడ్వడంతో వర్ష కూడా ఏడ్చేసింది. అసలేం అయిందంటే.. వర్ష వ్లాగ్ చేద్దామని.. అక్కికి అబద్ధం చెప్పాలని చెప్పింది‌ . కానీ అక్కి దానిని సీరియస్ అని అనుకొని ఏడ్చేశాడు. ఇక ఆ తర్వాత వర్ష తనని దగ్గరికి తీసుకొని.. అదంతా అబద్ధమని ఎక్కడికి వెళ్ళట్లేదని వర్ష చెప్పినా ఆ బాబు ఏడుస్తూనే ఉన్నాడు. ఇక ఫ్రాంక్ చేద్దామని వర్ష అనుకుంటే ఆ బాబుతో పాటు తను కూడా ఏడ్వాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. మరి మీరు ఈ వీడియోని చూసారా లేదంటే ఓసారి చూసేయ్యండి.