Read more!

English | Telugu

ఎంగేజ్మెంట్ చేసుకున్న రాకింగ్ రాకేష్-జోర్దార్ సుజాత

రాకింగ్ రాకేష్ - జోర్దార్ సుజాత ఈ జోడి గురించి బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కరలేదు. వీళ్ళిద్దరూ  జబర్దస్త్ కమెడియన్లుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే  వీళ్ళు  త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు సుజాత తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియన్స్ కి చెప్పేసింది. ఇప్పుడు వీళ్ళ ఎంగేజ్మెంట్ చాలా ఘనంగా జరిగింది. దీనికి బుల్లితెర నటీనటులు వెళ్లి వాళ్ళను విష్ చేశారు. యాంకర్ రవి ఈ ఎంగేజ్మెంట్ పెయిర్ తో కలిసి దిగిన ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసుకున్నాడు. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

 "కంగ్రాట్యులేషన్స్ టు థిస్ లవ్లీ కపుల్" అని విష్ చేసాడు రవి. ఇక ఈ ఎంగేజ్మెంట్ కి మంత్రి రోజా కూడా విచ్చేసి విషెస్ చెప్పేసారు. ఆ ఫోటోలో గెటప్ శీను ఫామిలీ, అనసూయ, శ్రీవాణి, ఇంకొంత మంది బుల్లితెర యాక్టర్స్ కూడా హాజరయ్యారు. ఇప్పటికే ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో రాకింగ్ రాకేష్ తో కలిసి జోర్దార్ సుజాత ప్రేమ, పెళ్లి, సంసారం పేరుతో బోలెడన్ని స్కిట్స్ కూడా చేసేసింది. 

అయితే ఇవన్నీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడం కోసం.. ఇప్పుడు ఆ క్షణాలను కూడా నిజం చేసి చూపించారు. టీవీ యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన సుజాత.. న్యూస్ రీడర్ గా  గుర్తింపు తెరుచుకొని బిగ్ బాస్ ఛాన్స్ కొట్టేసి ఫేమస్ ఐపోయింది. వెంటనే జబర్దస్త్ స్టేజి మీద రాకేష్ తో జోడి కట్టి ఇప్పుడు మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెడుతోంది.