English | Telugu

మగాడి జీవితం గోధుమపిండి లాంటిది...డిన్నర్, విన్నర్, రన్నర్ అంటున్న నూకరాజు

 

జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. తాగుబోతు రమేష్-నూకరాజు కలిసి డబుల్ మీనింగ్ డైలాగ్స్ ని తెగ వాడేశారు. "కృష్ణ భగవాన్ గారు ఈరోజు లంచ్ కి రూమ్ కి రమ్మన్నారు" అంటూ తాగుబోతు రమేష్ నూకరాజుకి చెప్పేసరికి "ఎందుకు" అన్నాడు. "లంచ్ కి లంచ్ కి" అన్నారు కృష్ణ భగవాన్.. "అట్టా నేను లంచ్ కి రాను డిన్నర్ కి వెళ్తా" అంటూ తాగుబోతు రమేష్ గారం పోయేసరికి దణ్ణం పెట్టారు కృష్ణ భగవాన్. "నువ్వు డిన్నర్ కి వెళ్తే విన్నర్ ఆయనే అవుతారు..నేను రన్నర్ అవ్వాల్సి వస్తుంది" అంటూ నూకరాజు కూడా దణ్ణం పెట్టేసాడు.

"మగవాడి జీవితం గోధుమ పిండి లాంటిది. నిప్పుల మీద కాలిస్తే పుల్క, కొంచెం నూనె వేసే కలిస్తే చపాతీ, డైరెక్ట్ గా నూనెలే వేసేస్తే పూరి ఐపోతుంది" దీన్ని బట్టి నీకేం అర్ధమవుతుంది అని రాఘవ అడిగేసరికి "మగాళ్ల జీవితం పొంగుతూ ఉంటుంది అంటూ డబుల్ మీనింగ్ అని తెలిసి అన్నదో, తెలీక అన్నదో డైలాగ్ ఐతే అనేసింది తెలుగు తెలీని రష్మీ. ఇక వీళ్ళ మాటల్లో కనిపించని బూతు కామెడీ బాగా ఎక్కువైపోయింది. ఐతే ఈ ప్రోమో చూసిన నెటిజన్స్ మాత్రం స్కిట్స్ లో అస్లీలత ఎక్కువైపోయింది అని కామెంట్స్ చేస్తున్నారు.