Read more!

English | Telugu

డింపుల్ హయాతి ఎంట్రీతో బైబై చెప్పేసిన ఖుష్బూ!

ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షో ఈ వారం కొంచెం అలరించింది. ఇంకొంచెం సప్పగా సాగింది. ఇక ఈ షోకి రామబాణం మూవీ టీమ్ నుంచి హీరోయిన్ డింపుల్ హయాతి, డైరెక్టర్ శ్రీవాస్ వచ్చారు. ఇక బులెట్ భాస్కర్ టీం దసరా మూవీని స్పూఫ్ గా చేసి చూపించారు. ఇక వీళ్ళ స్కిట్ ఎలా ఉంది అని డింపుల్ ని అడిగింది రష్మీ. "ఇమ్ము ఈ స్కిట్ కి మంచి ఎనర్జీ తీసుకొచ్చాడు" అని చెప్పింది. దాంతో వర్ష మధ్యలోకి వచ్చి "నిన్నటి నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాడు" అని చెప్పింది. చెప్పాలంటే "నేను మీకు పెద్ద ఫ్యాన్" ని అని డింపుల్ ఇమ్ముకి చెప్పేసరికి తెగ సిగ్గుపడిపోయాడు. ఇక ఆమె కుర్చీ దగ్గరకు వచ్చి చేతిలో చెయ్యేసి ఆమెను స్టేజి మీదకు తీసుకొచ్చి ఆమెతో డ్యూయెట్ స్టెప్ వేసాడు. బేసిక్ గా నేను డింపుల్ గారికి పెద్ద ఫ్యాన్ ని" అని చెప్పేసరికి "ఇమ్ము బై బై" అని చెప్పింది ఖుష్బూ.

"మీరు వెళ్ళిపోయినా పర్లేదు నాకు డింపుల్ గారు ఉంటే చాలు" అన్నాడు ఇమ్ము. ఇమ్ము మాటలకు ఫీల్ ఐపోయిన బులెట్ భాస్కర్ "ఆవిడ వెళ్ళిపోతే నేనెలా బతకాలిరా" అన్నాడు. ఆ మాటకు ఖుష్భు నవ్వుతూ  దణ్ణం పెట్టేసింది. తర్వాత  "ఈ ఫ్యాన్ మూమెంట్ ని ఒక స్టెప్ వేసి సెలెబ్రేట్ చేయాలి కదా" అంది రష్మీ అందరితో డాన్స్ చేయించింది. ఇక ఈ మూవీ టీమ్ కి బులెట్ భాస్కర్ విషెస్ చెప్పాడు. తర్వాత ఆటో రాంప్రసాద్ టీం వచ్చి స్కిట్ వేశారు. "మనదే పానీపూరి బండి..రష్మీ ఇది తిని చెప్పు ఎలా ఉందో" అని ఇచ్చాడు. "చాలా బాగుంది మరి నిన్న ఎందుకు బాలేదు" అని అడిగింది. "నిన్న స్నానం చేయలేదులే" అందుకే అని కుళ్ళు జోక్ వేసాడు రాంప్రసాద్. హీరోయిన్స్ ని చేయమంటూ శ్రీసత్య, కొమరయ్య, డింపుల్ రాంప్రసాద్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళను ఒక రేంజ్ లో ఆడుకున్నాడు.

ఇక శ్రీవాస్ స్టేజి మీదకు నరేష్ ని తీసుకొచ్చి "మేము ఇలా హీరోయిన్స్ కావాలంటూ వచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారని తెలిసి స్టింగ్ ఆపరేషన్ చేసాం. ఆల్రెడీ రామబాణం మూవీ షూటింగ్ ఐపోయింది. డింపుల్ మా మూవీలో హీరోయిన్...మీ గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి మా హీరోయిన్ ని పంపించాం" అని చెప్పాడు శ్రీవాస్. ఇలా ఈ వారం స్కిట్స్ ని పెర్ఫార్మ్ చేసి ఆటో రాంప్రసాద్ టీం, రౌడీ రోహిణి టీమ్స్ విన్నర్స్ గా నిలిచారు.