Read more!

English | Telugu

నవ్వించే సత్తా ఉంటే మీరే ఫ్యూచర్ కమెడియన్ మీరే

దాదాపు పదేళ్ల నుంచి బుల్లితెర మీద ప్రతీ వారం వినోదం పంచుతూ వస్తోంది జబర్దస్త్ షో. ఈ వేదిక ఎంతో మందికి ప్రాణం పోసింది...మంచి జీవితాన్ని ఇచ్చింది. పేరు, డబ్బు, అవకాశాలను అందించింది. ఈ స్టేజిని యూజ్ చేసుకుని ఈరోజున ఎంతోమంది పాపులర్ అయ్యారు. సినిమా ఛాన్సులు కూడా అందుకున్నారు. అలాంటి జబర్దస్త్ తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్ పేరుతో వారంలో రెండు రోజులు కామెడీ షోతో ఆడియన్స్ ని వారానికి రెండు రోజుల పాటు నవ్వించడం మొదలు పెట్టారు. ఎన్ని షోస్ వచ్చి పోయినా ఈ షోస్ కి మాత్రం రేటింగ్ కానీ చూసే ఆడియన్స్ సంఖ్య కానీ తగ్గేదేలే అన్నట్టుగా ఉంది. అలాంటి జబర్దస్త్ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కమెడియన్స్ కోసం ఒక అనౌన్స్మెంట్ ని ఇచ్చేసింది. ఇద్దరు కానీ అంత కన్నా ఎక్కువగా కానీ ఒక గ్రూప్ గా కలిసి టు టు త్రి మినిట్స్ ఓన్ కామెడీ కంటెంట్ రికార్డు చేసి మీ ఫోన్ నంబర్ ని యాడ్ చేసి   jabardasth @mallemaala .com కి మెయిల్ చేయమని చెప్పారు.

పదేళ్ల క్రితం ఈ స్టేజి మీద జర్నీ మొదలుపెట్టిన ఎంతో మంది కమెడియన్స్ అంటే అదిరే అభి, వేణు, రఘు, సునామి సుధాకర్ ఇలాంటి వాళ్ళు ఎంతో మంది దీనికి పునాదులు వేయగా ఆ తర్వాత వచ్చిన సుధీర్, గెటప్ శీను, రాంప్రసాద్, రాకెట్ రాఘవ వంటి వాళ్ళు ఈరోజున మంచి పొజిషన్స్ లో నిలబడ్డారు. ఇక లేడీస్ కూడా ఈ షో ద్వారా లేడీ కమెడియన్స్ గా గుర్తింపు తెచ్చుకుని మూవీస్ లో కూడా అవకాశాలు అందుకుని దూసుకుపోతున్నారు. అలాంటి ఈ స్టేజిని మంచి యూజ్ చేసుకుని దూసుకుపోవాలని అనిపిస్తే ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఒక కామెడీ స్కిట్ రాసుకుని సరదాగా పెర్ఫార్మ్ చేసి మెయిల్ చేసేయండి మరి. ఫ్యూచర్ కమెడియన్ మీరే కావొచ్చు.