Read more!

English | Telugu

బాలయ్య డైలాగ్స్ తో అదరగొట్టిన హైపర్ ఆది!

ఢీ-15 ఛాంపియన్‌షిప్‌ బ్యాటిల్ ఈ వారం కూడా సరికొత్తగా అలరించింది. ఇక ఇందులో ఆది, జెస్సి, దివ్య ఎప్పటిలాగే నవ్వించారు. అలా ఇంట్లో వంట కోసం కూరగాయలు తరుగుతూ ఎవరెవరు ఏ కూరగాయ లాంటి వాళ్ళో చెప్పాడు ఆది. మిరపకాయను చూసి ఇది డాన్స్ మాస్టర్ సుదర్శన్ కి సరిపోతుంది. ఎందుకు అన్నట్టుగా జెస్సి అడిగేసరికి "మిరపకాయ మనం తిన్నా మండుతుంది.. అతని మాటలు విన్నా మండుద్ది" అని అన్నాడు. బెండకాయను ఏమంటారు అని జెస్సి అడిగేసరికి "జెస్సి ఫింగర్" అంటారని చెప్పాడు. శ్రద్ధాదాస్ ఐతే ఒక కూరగాయల తోటే.. ఇక శేఖర్ మాస్టర్ ఇడ్లీలోకి కూడా మునక్కాయ చట్నీ తినేస్తాడు అని చెప్పాడు. ఇక ప్రదీప్ ఉప్పులాంటోడు.. ఏ కూరా ఉప్పు లేకుండా బాగోదు ఏ షో కూడా ప్రదీప్ లేకుండా బాగోదు అని చెప్పాడు. దివ్య అంటే బీట్ రూట్. మనం బీట్ వేయాల్సిన ఒకే ఒక్క రూట్ అది అన్నాడు ఆది. ఫైనల్ గా తాను  చిక్కుడుకాయ లాంటి వాడిని అని.. ఎక్కడబడితే అక్కడ చిక్కుతూ ఉంటాను అని అందరి గురించి చెప్పాడు ఆది. 

"ఎన్ని రోజులు వంట చేసుకుంటావ్ పెళ్లి చేసుకోవచ్చు కదా" అని జెస్సి ఆదికి సలహా ఇచ్చాడు. "వాట్సాప్ లో వరసబెట్టి 20 మందితో చాట్ చేసినప్పుడు.. నో పెళ్లి. ఆల్రెడీ జరిగిపోయిన బర్త్ డేకి మళ్ళీ బర్త్ డే పార్టీ పేరుతో అమ్మాయిలను పిలిచినప్పుడు.. నో పెళ్లి. మేం కరువులో ఉన్నాం అయ్యా ఇది పరిస్థితి అని మొరపెట్టుకుంటే.. నో పెళ్లి. అప్పుడు లేవని నోరు ఆఫ్ట్రాల్ వంట చేస్తుంటే లేస్తుందే..ఏ.." అంటూ బాలయ్య రేంజ్ లో డైలాగ్ చెప్పి ఎంటర్టైన్ చేసాడు ఆది. "నువ్ ఎంతైనా చెప్పు బ్యాచిలర్ గా ఉండలేకపోతున్నాం" అని జెస్సి అనేసరికి "బ్యాచిలర్ లైఫ్ అంటే వేస్ట్ కాదురా.. బెస్ట్... చివరికి దేవుడైన బ్యాచిలర్ లైఫ్ నుంచే స్టార్ట్ చేయాలి. అలాంటి బ్యాచిలర్ కి పొట్ట వచ్చినా, బట్ట వచ్చిన, నెట్టు వచ్చినా కేలిక్యులేషన్...ఇలా ఐతే ఫ్యూచర్ ల బ్యాచిలర్ రూముల్లోనో, పార్కుల్లోనో కాదు, మ్యూజియంలో పెట్టాల్సి వస్తుంది. బ్యాచిలర్ లేకపోతే అమ్మాయిలకు రీఛార్జి లేదు. బ్యాచిలర్ లేకపోతే నెట్ సెంటర్ లేదు, బ్యాచిలర్ లేకపోతే కర్రీ పాయింట్ లేదు.. బ్యాచిలర్ లేకపోతే కక్కుర్తి అనేదే లేదు... పెళ్ళైన మగాడికి ఆపద వస్తే అరగంట ఆలోచిస్తానేమో... అదే బాచిలర్ కి ఆపద వస్తే అరక్షణం కూడా ఆలోచించను. ఐ విల్ షో దెమ్ ది ఎండ్." అంటూ బాలయ్య డైలాగ్ లను తనదైన శైలిలో పేరడీగా చెప్పి అందరినీ నవ్వించాడు ఆది.