Read more!

English | Telugu

మాములుగా లేదు చిత్తడి చిత్తడి చేశారు!

ఢీ-15 ఛాంపియన్ షిప్ బాటిల్ అప్పుడే క్వార్టర్ ఫైనల్స్ కి వచ్చేసింది. ఇక ఈ షోకి సంబంధించిన  ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోలో కంటెస్టెంట్స్ అంతా  కలర్ ఫుల్ గా , మంచి గ్రేస్ ఫుల్ గా డాన్సులు చేసి ఎంటర్టైన్ చేశారు. "ఒక వందో, ఒక వెయ్యో" అనే సాంగ్ కి గగన్, దిశా పింక్ కలర్ కాస్ట్యూమ్స్ లో డాన్స్ చేసి అదరగొట్టారు. ఆ పెర్ఫార్మెన్స్ కి జడ్జి శ్రద్ద ఫిదా ఐపోయింది. "ఇద్దరూ పర్ఫెక్ట్ గా గ్రేస్ ఫుల్ గా చేశారు" అని కాంప్లిమెంట్ ఇచ్చేసింది. తర్వాత "దసరా" మూవీ బిట్స్ ని స్పూఫ్ గా చేశారు హైపర్ ఆది, మోడల్ జెస్సి, దివ్య.

ఇక దివ్య వెన్నెల గెటప్ లో వచ్చి "సూరి ఎప్పుడు తాళి కడతావ్ రా" అని జెస్సిని అడిగేసరికి "ముందు వాడి పెళ్లాయ్యాక నీకు కడతాడు" అని ఆది ఫన్నీ జోక్ వేసాడు. ఇక పండు వచ్చి వెన్నెలని అదే పనిగా చూస్తూండేసరికి "ఏమిటి అలా చూస్తున్నావ్" అని దివ్య  అడిగింది. దానికి హైపర్ ఆది "నువ్ చీర బాగా కట్టుకున్నావ్ కదా చెప్తే వీడు కూడా కట్టుకుంటాడు" అన్నాడు ఆది. "జెస్సి చెప్పింది చెప్పడు, పండు చెప్పిందే చెప్తాడు, ప్రదీప్ చెప్పింది వినడు, దివ్య విన్నది చెప్పదు, శ్రద్దా అడిగింది ఇవ్వదు, శేఖర్ మాస్టర్ మాత్రం ఇవ్వనిదే అడుగుతాడు" ఏందిరా ఇది అని తలపట్టుకున్నాడు ఆది. ఆ తర్వాత "అరె అరె రామ అరె అరె కృష్ణ" సాంగ్ కి రాహుల్ క్యూట్ పెర్ఫార్మెన్స్ చేసి అందరినీ మెస్మోరైజ్ చేసేసాడు. "క్వార్టర్ ఫైనల్స్ లో కొత్త రకం డాన్స్ చూసాను" అన్నాడు శేఖర్ మాస్టర్. ఇక సోమేశ్ మాస్టర్ తన బాయ్స్ తో టెంపర్ మూవీ సాంగ్ కి డాన్స్ చేయించాడు. ఆ డాన్స్ చూసి శేఖర్ మాస్టర్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు.

"కోరియోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ లో ఉంది" అని చెప్పాడు. ఫైనల్ గా శేఖర్ మాస్టర్ , శ్రద్దా ఇద్దరూ కలిసి ఐ ఫీస్ట్ డాన్స్ చేశారు. "కమాన్ కమాన్ కళావతి" సాంగ్ కి ఇద్దరూ మాములుగా చేయలేదు డాన్స్...స్టేజి మీద ఊగిపోయింది. ఇక ఆది శ్రద్దా సీట్ లో కూర్చుని "ఈరోజు మీరు డాన్స్ చిత్తడి చిత్తడి చేశారు" అని కాంప్లిమెంట్ ఇచ్చాడు.