English | Telugu

ఇమ్మాన్యుయేల్‌.. నీది మామూలు టాలెంట్ కాదురా బాబూ!

'జబర్దస్త్' షోతో చాలా మంది కమెడియన్స్ లైమ్ లైట్ లోకి వచ్చారు. తమదైన కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తున్నారు. ఒక్కోసారి వారిలో ఉండే టాలెంట్ చూపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా కమెడియన్ ఇమ్మానుయేల్ కూడా ఇలాంటి లిస్ట్ లో చేరిపోయాడు. చూడడానికి నల్లగా ఉన్నా.. అదే తన బలంగా చేసుకొని బుల్లితెరపై దూసుకుపోతున్నాడు. 'జబర్దస్త్' షోలో వర్షతో కలిసి ఇమ్మాన్యుయేల్ చేసే కామెడీ మాములుగా ఉండదు.

ఈ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒక్క 'జబర్దస్త్' షోలో మాత్రమే కాకుండా ఏ షోలైనా వీరిద్దరికీ స్పేస్ ఇవ్వాల్సిందే. అంతగా వీరి క్రేజ్ పెరిగింది. ఈ క్రమంలో తాజాగా తనలోని మరో కోణాన్ని బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఇమ్మాన్యుయేల్. ఈ మధ్యకాలంలో చాలా ఈవెంట్స్ లో ఈ కమెడియన్ కనిపిస్తున్నాడు. చూడడానికి అమాయకంగా ఉన్నా.. అతడికి ఉన్న క్రేజ్ తో ముందువరుసలో ఉంటున్నాడు. తాజాగా 'శ్రీదేవి డ్రామా కంపెనీ' అనే టీవీ షోలో పాల్గొన్నాడు ఇమ్మాన్యుయేల్.

మదర్స్ డే సందర్భంగా మే 8న ప్రసారం కానున్న ఈ షోలో అమ్మ పాట పాడి అందరినీ ఆకట్టుకున్నాడు ఇమ్మాన్యుయేల్. 'నాని' సినిమాలో 'పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా' అనే పాట అందుకున్న ఇమ్మాన్యుయేల్.. పాటలో వచ్చే ఫిమేల్ వెర్షన్ ను కూడా తనే పాడి ఆశ్చర్యపరిచాడు. ఈ పాట విన్నవారంతా ఫిదా అయ్యారు. ప్రతీ ఒక్కరూ ఈ పాటకు కనెక్ట్ అయ్యారు. హైపర్ ఆది అయితే.. 'నీది మామూలు టాలెంట్ కాదురా బాబు' అంటూ ఇమ్మాన్యుయేల్ ను తెగ పొగిడేశాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.