Read more!

English | Telugu

చెఫ్ మంత్ర ఒక ఫెమినిస్ట్ షో...

 

చెఫ్ మంత్రం సీజన్ 3 నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి సుందరం మాష్టర్ మూవీ టీమ్ నుంచి వైవా హర్ష, దివ్య శ్రీపాద వచ్చారు. రావడంతోనే హర్ష నిహారిక మీద ఒక అదిరిపోయే కవిత్వం చెప్పేసాడు. "స్వర్గంలో ఉంటారు రంభ, ఊర్వశి, మేనక...వాళ్ళ ముగ్గురిని కలిపితే మన నిహారికా" అని చెప్పాడు. ఇక నిహారిక ఈ మాటలకు పడిపోయింది. "ఈరోజు ఎంత మంచి ఫుడ్ వండినా వద్దు...నా కడుపు నిండిపోయింది"..అని చెప్పింది. తర్వాత కొన్ని వస్తువులు ఇచ్చి టచ్ చేసి అవేంటో చెప్పేలా ఒక గేమ్ ఆడించింది. దాంతో హర్ష ఒక కామెంట్ చేసాడు.

"ఇప్పుడు గాలొస్తోంది...ఇందాక గాలి రాలేదు..ఇక్కడ అమ్మాయిలు ఆడుతున్నప్పుడు ఏదో జరుగుతోంది " అన్నాడు హర్ష. ఆ మాటలకు  నిహారిక సీరియస్ ఐపోయింది. "హలో నువ్వు సుందరం మాస్టర్ అయ్యుండొచ్చు. కానీ ఈ చెఫ్ మంత్రాలో నేనే మాస్టర్" అని చెప్పింది. "సర్ ఇదైతే చాలా ఫెమినిస్ట్ షో....ఐనా ఏంటి సిఐడి షోలో మెయిన్ విలన్ లా చూస్తారేంటి" అంటూ హర్ష నిహారికను అడిగాడు. ఇక ఫైనల్ గా యాదమ్మ రాజు ఎంట్రీ ఇచ్చాడు. ఇక దివ్య శ్రీపాదను పటాయించాడు యాదమ్మ రాజు. "ఒకవేళ నేను హీరో ఐతే నా పక్కన హీరోయిన్ గా చేస్తారా మీరు..మదర్ క్యారెక్టర్ కాదు హీరోయిన్ క్యారెక్టర్ " అని అడిగాడు. "తప్పకుండా చేస్తా" అని చెప్పింది. ఆ మాటలు విన్న నిహారిక "వాడి పక్క హీరోయిన్ కంటే  మదర్ క్యారెక్టర్ బెటర్" అని చెప్పింది. చెఫ్ మంత్ర షో ప్రతీ వారం అలరిస్తోంది. ఇందులో నిహారికా రకరకాల ప్రశ్నలకు అడుగుతూ వచ్చే వారందరితో  వంటలు చేయిస్తూ, వాటి రుచి చూస్తూ ఉంటుంది.