English | Telugu

ఫొటో ఫీచ‌ర్‌: బేబీ బంప్‌తో బిగ్ బాస్ బ్యూటీ!‌

ఈ మ‌ధ్య బేబీ బంప్‌తో ఫొటో షూట్‌లు చేసుకోవ‌డం ఓ ఫ్యాష‌న్‌గా మారిపోయింది. స్టార్ హీరోయిన్‌ల నుంచి రియాలిటీ షో కంటెస్టెంట్ల‌ వ‌ర‌కు బేబీ బంప్ తో ప్ర‌త్యేకంగా ఫొటోల‌కు పోజులిచ్చేస్తున్నారు. ఇప్పుడిదొక ట్రెండ్‌గా మారిపోయింది. తాజాగా ఈ జాబితాలో న‌టి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ హ‌రితేజ కూడా చేరిపోయింది. అ ఆ, ప్ర‌తిరోజు పండ‌గే, హిట్ వంటి చిత్రాల్లో న‌టించి త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది హ‌రితేజ‌.

బిగ్‌బాస్ సీజ‌న్ 1లో పాల్గొని మ‌రింత పాపుల‌ర్ అయింది. ఇటీవ‌లే బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ రీయూనియ‌న్‌లో భాగంగా స్టార్ మా చాన‌ల్‌ ఏర్పాటు చేసిన 'బిగ్‌ బాస్‌ ఉత్స‌వం 2'లో పాల్గొన్న హ‌రితేజ‌కు బిగ్‌బాస్ సీజ‌న్ 1 కంటెస్టెంట్స్ వేదిక‌పైనే శ్రీ‌మంతం చేయ‌డం ఆక‌ట్టుకుంది. ఈ సంద‌ర్భంగా భావోద్వేగానికి లోనైంది హ‌రితేజ.

ఇదిలా వుంటే త్వ‌ర‌లో పండంటి పాపాయికి జ‌న్మ‌నివ్వ‌బోతున్న ఆమె బేబీ బంప్‌తో బ్లాక్ డ్రెస్‌లో ఫొటోల‌కు పోజులిచ్చింది.

బిగ్‌బాస్ సీజ‌న్ 1లో టాప్ 5లో నిలిచిన హ‌రితేజ తాజాగా బేబీ బంప్‌తో ప్ర‌త్యేకంగా ఫొటో షూట్ చేయించుకుంది. ఆ ఫొటోల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. ఒక్క పిక్చ‌ర్ మిన‌హా మిగ‌తావాటిని బ్లాక్ అండ్ వైట్‌లో పోస్ట్ చేసింది.వాటికి "Never lose the kid in ur heart" అంటూ క్యాప్ష‌న్ జోడించింది.

ఈ ఫొటోలు నెట్టింట సంద‌డి చేస్తున్నాయి. వీటిని చూసిన నెటిజ‌న్స్ నైస్, క్యూట్ అంటూ కామెంట్‌లు పెడుతున్నారు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.