Read more!

English | Telugu

అష్షు ఫోన్ లిఫ్ట్ చేసిన ఆర్జీవీ...తన లవ్ ని ఎక్సప్రెస్ చేసిన హరి

ఎక్స్ప్రెస్ హరి చేత స్టేజి మీద కన్నీళ్లు పెట్టించిన అష్షురెడ్డి. "ఆదివారం విత్ స్టార్ మా పరివారం" ఈవారం సందడి చేయడానికి రెడీ ఐపోయింది. దాని ప్రోమో కూడా మస్త్ జోష్ తో ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఈ షోకి ఈ వారం అవినాష్, ఫైమాని హైజాక్ చేసి వాళ్ల ప్లేస్ లో ఎక్సప్రెస్ హరి ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత యాదమ్మ రాజు, జ్ఞానేశ్వర్, భాస్కర్ వచ్చారు. ఆ తర్వాత బ్యూటీ క్వీన్స్ అష్షు, ఇనాయ, అరియానా, భానుశ్రీ ఎంట్రీ ఇచ్చారు. అవినాష్ ఆర్జీవీ రేంజ్ లో డైలాగ్ చెప్పడానికి ట్రై చేసాడు. తర్వాత శ్రీముఖి ఒక టాస్క్ ఇచ్చింది.

మీ ముగ్గురు ఆర్జీవీకి ఫోన్ చేయండి. ఎవరి కాల్ ఆన్సర్ చేస్తారో చూద్దాం అని చెప్పింది. మొదట ఆరియానా ఫోన్ చేసింది కానీ లిఫ్ట్ చేయలేదు. తర్వాత ఇనాయ ఫోన్ చేసింది. కానీ నో యూజ్. ఫైనల్ గా అష్షు ఫోన్ చేసింది. ఆర్జీవీ అష్షు ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి సడెన్గా మీరంతా నాకు ఫోన్ చేస్తున్నారు అని అడిగేసరికి ఆరియానా లేచి ఫుల్ క్లాస్ ఇచ్చింది. "నేను ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు" అని అడిగింది. తర్వాత అష్షుకి ముద్దు పెట్టాలంటూ శ్రీముఖి ఎక్సప్రెస్ హరికి టాస్క్ ఇచ్చింది. దాంతో హరి " అష్షు నేను నీకంటే చిన్నోడినే. ప్రేమకి అవేవి ఉండవు కాబట్టి ఈ స్టేజి మీద జెన్యూన్ గా చెప్తున్నా ఐ లవ్ యు అష్షు అంటూ ఏడ్చేశాడు" . దానికి అష్షు "హే ఏంటబ్బా ఏడుస్తాడు " అని చిరాకుపడింది. " "అష్షు యాక్సెప్ట్ చేయొచ్చుగా..హరి నిన్ను నిజంగానే లవ్ చేస్తున్నారుగా" అని వంత పాడింది ఆరియానా. "ఎస్ చెప్తే నా అంత అదృష్టవంతుడు లేదు అనుకుంటా నో చెప్తే నీ అంత అదృష్టం నాకు లేదని అనుకుంటా..బట్ నేనెప్పుడూ నిన్ను దేవతలాగే చూసుకుంటా " అంటూ హరి ఓవర్ డైలాగ్స్ చెప్పేసరికి సమాధానం ఏం చెప్పాలో తెలియక తికమకపడింది అష్షు.