Read more!

English | Telugu

‘గుప్పెడంత మనసు’ సీరియల్ TRP లో మూడవ స్థానంలో ఉండటానికి కారణమేంటి?


బుల్లితెరపై స్టార్ మా టీవీలో వచ్చే సీరియల్స్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సినిమాల్ని తలపించే ట్విస్ట్ లతో సాగదీస్తూ రోజుకో మలుపుతో ఈ సీరియల్స్ ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇందులో స్టార్ మాటీవీలో వచ్చే 'గుప్పెడంత మనసు'  సీరియల్ కి చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు. అదే కాకుండా ఈ మధ్యలో మొదలైన 'బ్రహ్మముడి' సీరియల్ ఇప్పటికే అత్యధిక TRP తో దూసుకుపోతుంది. అయితే ఈ రెండు సీరియల్స్ కి డైరెక్టర్ కుమార్ పంతం ఒక్కడే కావడం విశేషం. విభిన్న కథా కథనంతో ఈ రెండు సీరియల్స్ ఆకట్టుకుంటున్నాయి. 'బ్రహ్మముడి' సీరియల్ కి  సెలబ్రిటీస్ ప్రమోట్ చెయ్యడం వల్ల దీనిపై భారీ అంచనాలే పెరిగాయి. అయితే ఇప్పుడు TRP లో మొదటి స్థానంలో 'బ్రహ్మముడి', మూడవ స్థానంలో 'గుప్పెడంత మనసు' సీరియల్స్ ఉన్నాయి.

ఈ సీరియల్స్ డైరెక్టర్ కుమార్ పంతం.. తను డైరెక్ట్ చేస్తున్న సీరియల్స్ షూటింగ్ అప్‌డేట్స్ ని ఎప్పటికప్పుడు తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ ఇస్తూ ఈ సీరియల్ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటూ వస్తున్నాడు. కాగా తన ఇన్ స్టాగ్రామ్ లో 'ఆస్క్ మీ క్వశ్చన్' అని పోస్ట్ చేయగా.. ఫ్యాన్స్ కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలను అడిగారు. ఒక అభిమాని.. 'మీ డైరెక్షన్ లో మీకు టఫ్ అనిపించిన సీన్ ఏంటి' అని అడుగగా.. అన్ని టఫ్ సీన్సే అని బదులిచ్చాడు కుమార్ పంతం. మరొక అభిమాని.. 'గుప్పెడంత మనసు సీరియల్ TRP తగ్గడానికి కారణం ఏంటి' అని అడుగగా.. అప్స్ అండ్ డౌన్ కామన్ అంటూ కుమార్ సమాధానమిచ్చాడు. గుప్పెడంత మనసు TRP లో మూడవ స్థానంకి వెళ్ళిపోయింది.. మళ్ళీ ఫస్ట్ ప్లేస్ కి రావాలని ఒకరు అడుగగా.. రావాలి అదే ట్రై చేస్తున్నామని కుమార్ చెప్పుకొచ్చాడు. మరొక అభిమాని.. 'మీకు గుప్పెడంత మనసు ఇష్టమా? లేక బ్రహ్మముడి ఇష్టమా అని అడుగగా.. నా ఆన్సర్ మీరే గెస్ చెయ్యండని ప్రేక్షకుల ఊహకే వదిలేసాడు డైరెక్టర్.

డైరెక్టర్ కుమార్ పంతం ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ పోస్ట్ కి విశేష స్పందన రావడంతో వైరల్ గా మారింది. అయితే ప్రేక్షకులు కోరుకుంటున్నట్లుగా TRP లో మూడవ స్థానంలో ఉన్న గుప్పెడంత మనసు మళ్ళీ మొదటి స్థానంలోకి వస్తోందో లేదో చూడాలి మరి.