English | Telugu

Guppedantha Manasu : కొంపముంచిన బుజ్జీ.. ఆ ఫోటో చూసి షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1130 లో.. శైలేంద్ర ఇంటికి ధనరాజ్ వస్తాడు. అన్నయ్య మీరు నాకు హెల్ప్ చెయ్యాలి. ఏదో కష్టపడి కొంచెం సంపాదించుకున్నాను కానీ నాకు ఒకటే లోటు పెళ్లి అవట్లేదని శైలేంద్ర, దేవయానిలతో ధనరాజ్ అంటాడు. అయితే మేమ్ ఏం చేస్తామని శైలేంద్ర అంటాడు. మీరు ఒక హెల్ప్ చేయాలి.. ఏంటంటే నన్ను చూసి అందరు సంబంధం ఒకే చేస్తున్నారు కానీ నాకు ఎవరు లేరని రిజెక్ట్ చేస్తున్నారు. అందుకే నాకు ఒక సంబంధం వచ్చింది. వాళ్ళకి నాకు ఒక అన్నయ్య, అమ్మ ఉన్నారని చెప్పాను.. అది మీరే కాస్త పెళ్లి చూపులకు నాతో రండి అని ధనరాజ్ అంటాడు.

మేమ్ రాము అని శైలేంద్ర కోప్పడతాడు. రాకుంటే మీరు చేసిన పనులన్నీ నాకు తెలుసు.. వాటిని బయటపెడతా అని ధనరాజ్ అనగానే.. వాడితో మనకేంటి? ఒకసారి వెళ్లి వస్తే వాడిది వాడు చూసుకుంటాడని దేవయాని అనగానే శైలేంద్ర సరే అంటాడు. మరొకవైపు రంగాకి వసుధార కాఫీ తీసుకొని వస్తుంది. అది తాగి బాగున్నా కూడా బాలేదని చెప్తాడు. అదే కాఫీ రాధమ్మకి వసుధార ఇచ్చి ఎలా ఉందని అడుగగా.. బాగుంసని రాధమ్మ చెప్తుంది. ఆ తర్వాత రంగా బిహేవియర్ కి వసుధార బాధపడి ఏడుస్తుంది. నేను కాఫీ బాలేదు అన్నందుకు ఇంత సీన్ చెయ్యాలా అని కాఫీ తాగుతూ బాగుందని రంగా అంటాడు. ఆ తర్వాత ధనరాజ్, శైలేంద్ర , దేవయానిలు పెళ్లిచూపులకి బయలుదేర్తారు. ధనరాజ్ అడ్రెస్ కోసం సంజీవయ్య కి కాల్ చేస్తాడు. పెళ్లి చూపులకి వస్తున్నాం.. లొకేషన్ షేర్ చేయ్యండని చెప్తాడు. దాంతో సరోజని లొకేషన్ షేర్ చేయమని సజీవయ్య చెప్తాడు. సరోజ లొకేషన్ షేర్ చేస్తుంది. ఆ తర్వాత సరోజ రంగా ఫ్రెండ్ బుజ్జికి ఫోన్ చేసి అబ్బాయి ఫోటో పంపిస్తుంది. ఇద్దరు పెళ్లి చూపులు క్యాన్సిల్ చేయడానికి ప్లాన్ చేస్తారు.

మరొకవైపు రాధమ్మ సరోజ వాళ్ళ ఇంటికి వెళదాం.. సంజీవయ్య పిలిచి వెళ్ళడు కదా అని రంగాతో అంటుంది. నేను రాను అక్కడ బావ అంటే ఇష్టమని సరోజ అంటే బాగోదని రంగా అంటాడు. సరే అని రాధమ్మ వెళ్తుంది. ఆ తర్వాత శైలేంద్ర, దేవయాని, ధనరాజ్ లు వస్తుంటే.. బుజ్జి అడ్డుపడతాడు. మీరు పెళ్లి చూపులకి వెళ్లే అమ్మాయి, నేను ప్రేమించుకున్నాం కావాలంటే ఫోటో చూడండి అంటూ బుజ్జి చూసుకోకుండా రంగా సరోజల ఫోటో చూపిస్తాడు. ఆ ఫొటోలో రంగాని చూసిన శైలేంద్ర, దేవయానిలు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.