Read more!

English | Telugu

Guppedantha Manasu : మీటింగ్ లో వాళ్ళిద్దరికి షాక్.. అసలు నిజం ఇదే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1048 లో... దేవయానికి శైలేంద్ర ఫోన్ చేసి.. ఆ మను గాడు మళ్ళీ కాలేజీకి వస్తున్నాడట అని చెప్తాడు. కాన్ఫరెన్స్ కాల్ లో రాజీవ్ కూడా ఉంటాడు. ఇన్నిరోజులు వేరే ఇప్పుడు వేరే.. వాడి బలహీనత మనకు తెలుసు కదా అని దేవయాని అంటుంది. ఇప్పుడు కాలేజీలో ఏం జరుగుతుందని శైలంద్రని దేవయాని అడుగుతుంది. కాసేపట్లో బోర్డు మీటింగ్ ఉందని శైలేంద్ర చెప్పగానే.. మళ్లీ వాడి చేతికీ గాయం అవుతుందన్న మాట లాస్ట్ టైమ్ కదా నీ మాటలు భరించలేక గాయం చేసుకున్నాడు.. ఇప్పుడు మళ్ళీ చేసుకుంటాడని రాజీవ్ అంటాడు.

అ తర్వాత మీరు చూస్తూ ఉండండి పుండు మీద కారం చల్లినట్లు ఒకటే ప్రశ్నని తిరిగితిరిగి అడుగుతాను. ఈ రోజు వాడి సంగతి చెప్తానని శైలేంద్ర అంటాడు. నువు ఏమైనా చేసుకో కానీ నా మరదలు జోలికి మాత్రం రాకూడదని రాజీవ్ అంటాడు.నేను కూడా వస్తానని దేవయాని అనగానే.. నువ్వు ఎందుకని శైలేంద్ర అంటాడు. నువ్వు ఏదైనా తడబడిన నేను కవర్ చేస్తాను కదా అని దేవయాని అంటుంది. మరొకవైపు మీరు కాలేజీకీ వచ్చినందుకు థాంక్స్ అని మనుకి వసుధార చెప్తుంది. రానని ఎందుకు అనుకున్నారని మను అంటాడు. అంటే శైలేంద్ర మిమ్మల్ని అ రోజు బాధ పెట్టాడు కదా అని వసుధార అంటుంది. కుక్కలు మొరిగితే వాటిని పట్టించుకుంటే ఎలా అని మను అంటాడు. ఈ పేరెంట్స్ టీచర్ కీ సంబంధించిన బాధ్యత మీరు తీసుకోవాలని మనుకి వసుధార చెప్తుంది.. దానికి సంబంధించినవన్ని నేను చూసుకుంటానని మను అంటాడు.

అ తర్వాత మీటింగ్ కి దేవయాని వస్తుంది. కావాలనే నువ్వు ఎండీ అయినప్పటి నుండి ఇలాంటి సమస్యలు.. అసలు రిషి గురించి నువ్వు పట్టించుకుంటున్నావా? మూడు నెలల్లో రిషిని తీసుకొని వస్తానన్నావని దేవయాని అనగానే.. వసుధారకి సపోర్ట్ గా మను  మాట్లాడుతాడు. బానే సపోర్ట్ చేస్తున్నావంటూ మనుని దేవయాని అడుగుతుంది. అసలు ఇక్కడ మీటింగ్ ఏంటి? మీరు మాట్లాడేదేంటని దేవయాని, శైలేంద్రల మీద ఫణీంద్ర కోప్పడి మీటింగ్ నుండి బయటకు పంపిస్తాడు.. అ తర్వాత పేరెంట్స్, లెక్చరర్ మీటింగ్ గురించి డిస్కస్ చేస్తారు. నువ్వేం దేవయాని గురించి పట్టించుకోకు.. నాకు తెలుసు నువ్వు రిషిని తీసుకొని వస్తావని వసుధారతో ఫణీంద్ర అంటాడు. ఆ తర్వాత మనుని తీసుకొని మహేంద్ర ఇంటికి వస్తాడు..అనుపమ, మను ఇద్దరు కోపంగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.