English | Telugu

Guppedantha Manasu : వసుధారకి గిఫ్ట్ ఇచ్చిన రిషి..

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1137 లో.... రంగాకి రిషి ఫోటోని చూపించి, ఇతను నా తమ్ముడు సేమ్ నీలాగా ఉన్నాడు ముందు నేను నమ్మలేదు కానీ నువ్వు వేరు వాడు వేరని ఆ తర్వాత క్లారిటీ వచ్చిందని శైలేంద్ర అంటాడు. అతను ఒక కాలేజీ ఎండీ మంచి మనిషి అలాంటివాడు ఇప్పుడు మా మధ్య లేడు. అందుకే నీతో అవసరం వచ్చిందని శైలేంద్ర అంటాడు. దాంతో అయితే నాతో ఏం అవసరమని రంగా అడుగుతాడు.

నువ్వు నాతో రిషిలా మా కాలేజీ కకి రావాలి ఎండీగా ఉండాలని శైలేంద్ర అనగానే.. నా వల్ల కాదు.. నేను పెద్దగా చదువుకోలేదు సర్ అని రంగా అంటాడు. అది నిజమే కానీ నువ్వు వచ్చి నన్ను ఎండీని చెయ్యండి అని చెప్పు చాలు.. ఇప్పుడు ఇలా చెయ్యకపోతే కాలేజీ నాశనం అవుతుంది. స్టూడెంట్ భవిష్యత్తు పాడవుతుంది. నువ్వు ఇది చేస్తే కాలేజీని స్టూడెంట్స్ ని మా బాబాయ్ ని కాపాడిన వాడివి అవుతావు. నువ్వు ఊరికే ఏం చేయకు,  నీకు కోటి రూపాయలు ఇస్తాను. అప్పులన్నీ తీరీపోతాయని రంగాని రిక్వెస్ట్ చేస్తాడు శైలేంద్ర. నేను ఒప్పుకోనని రంగా అనగానే.. నువ్వు అలోచించి నిర్ణయం చెప్పమని శైలేంద్ర అంటాడు.ఆ తర్వాత ఇలా వాడికి డబ్బులు ఆఫర్ చేశాను కానీ వాడు సైలెంట్ గా వెళ్లి పోయాడని దేవయానికి శైలేంద్ర వచ్చి చెప్తాడు. అలా డబ్బులు తీసుకోలేదంటే వాడు రిషి కావచ్చని దేవయాని అంటుంది. వాడు రిషి కాదు రంగా అని శైలేంద్ర అంటాడు. వాడే ఫోన్ చేస్తాడు ఒప్పుకుంటాడని శైలేంద్ర అనగానే.. అపుడే ధరణి చాటుగా ఆ మాటలు వింటుంది‌. వీల్లెదో ప్లాన్ చేస్తున్నారులని ధరణి అనుకుంటుంది.

ఆ తర్వాత మీరు కాలేజీ గురించి ఆలోచించకుండా.. నన్ను ఎలా రంగా కాదు రిషి అని ప్రూవ్ చెయ్యాలని స్వార్థంగా ఆలోచిస్తున్నారని వసుధార పైన రంగా కోప్పడతాడు. మీరు రండీ ఇద్దరం వెళదామని వసుధార అంటుంది. నేను రానని కోపంగా రంగా వెళ్తాడు. ఆ తర్వాత వసుధార మొహం కడుక్కొని అద్దం దగ్గరికి వెళ్లి చేసుకుంటుంది. తన చేతికి ఉన్న రింగ్ కనిపించదు. దాంతో అంతా వెతుకుతుంది. వెళ్లి రాధమ్మకి చెప్తుంది. దొరుకుతుందని రాధమ్మ అంటుంది. రిషి సర్ ఎక్కడా అని వసుధార అడగ్గానే.. బుజ్జిని తీసుకొని ఎక్కడికో వెళ్ళాడు. నీకు ఇది ఇవ్వమన్నాడని ఒక గిఫ్ట్ బాక్స్ ఇచ్చాడని, దానిని వసుధారకి ఇస్తుంది రాధమ్మ. మరొకవైపు శైలేంద్రని రంగా కలుస్తాడు. శైలేంద్ర చెప్పిన దానికి రంగా సరే అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.