Read more!

English | Telugu

Guppedantha Manasu : వాళ్ళ ప్లాన్ ని తిప్పికొట్టిన రాజీవ్.. వసుధారని పెళ్ళి చేసుకుంటాడా!

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1077 లో.... వసుధారని తనతో పాటు తీసుకొని వెళ్ళడానికి శైలేంద్ర వస్తాడు. మను బయటకు రావాలంటే ఇప్పుడు వసుధర నాతో రావాలి. అక్కడికి రాజీవ్ వస్తాడు.. అక్కడ అతన్ని పోలీసులు పట్టుకోవచ్చని శైలేంద్ర అంటాడు. నేను వెళ్తాను మీ కొడుకు ని కాపాడతానని వసుధార అనగానే.. అందరు షాక్ అవుతారు. అంటే దత్తత తీసుకుంటా అనుకున్నారు కదా అని వసుధార అంటుంది. ఆ తర్వాత శైలేంద్రతో పాటు వసుధార వెళ్తుంది.

ఇందులో ఏదైనా మత్లబ్ ఉందా అని శైలేంద్రని వసుధార అడుగుతుంది. ఏమీ లేదు ఇప్పుడు నిన్ను రాజీవ్ దగ్గరకి తీసుకొని వెళ్తున్నా అక్కడ మనం మాట్లాడుకుంటుండగా.. పోలీసులు ఎంట్రీ ఇచ్చి వాణ్ణి తీసుకొని వెళ్తారని శైలంద్ర అంటాడు. అప్పుడే కార్ ఎదరుగా ఎవరో ఉంటారు. శైలేంద్ర సడన్ గా కార్ ఆపి చూసేసరికి ఎదరుగా రాజీవ్ ఉంటాడు. ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావ్.. నేను లొకేషన్ చెప్పాను కదా అని శైలేంద్ర అనగానే.. అక్కడ కలిస్తే మన గురించి ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుందని ముందే కలిసానని రాజీవ్ అంటాడు.. ఆ తర్వాత ఇదంతా మా ప్లాన్ అని  వసుధారకి రాజీవ్ చెప్తాడు. వసుధారకి రాజీవ్ మత్తు మందు ఇచ్చి కార్ లో కూర్చోపెడతాడు.. నువ్వు కూడా నాతో రావాలని శైలేంద్ర ఫోన్ తీసుకుంటాడు రాజీవ్.. ఇప్పుడు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలని శైలేంద్ర అనుకుంటాడు.

నువ్వు శైలేంద్ర మాటలు నమ్మి ఒంటరిగా వసుధారని పంపించావని అనుపమ అడుగుతుంది.. వాడిని ఎవరు నమ్మారు.. ఒకవేళ ప్లాన్ ఫెయిల్ అయితే రాజీవ్ వల్ల వసుధారకి ప్రమాదం.. ప్లాన్ సక్సెస్ అయి రాజీవ్ ని పోలీసులు తీసుకొని వెళ్లినా.. వసుధారకి శైలేంద్ర ప్రాబ్లెమ్ క్రియేట్ చెయ్యడని గారంటీ లేదని మహేంద్ర అంటాడు. ఇంత అలోచించినవాడివి ఎందుకు వసుధాదని పంపించావని అనుపమ అడుగగా.. మను కోసమని అతను బయటపడతాడు. అలాగని వసుధార గురించి ఆలోచించలేదని కాదు.. నా ప్లాన్ లో నేను ఉన్నానని మహేంద్ర అంటాడు.. మరొకవైపు వసుధారని రాజీవ్ కిడ్నాప్ చేస్తాడు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు.. ఇప్పుడెలా వసుధారని ఇక్కడ నుండి కాపాడాలని శైలేంద్ర ఆలోచిస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.