Read more!

English | Telugu

Guppedantha Manasu : మనసు మార్చుకున్న శైలేంద్ర.. అతను‌ ఇచ్చే షాకింగ్ న్యూస్ అదేనా!

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1074 లో.. వసుధార, మహేంద్ర ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలని శైలేంద్ర.. వసుధార క్యాబిన్  లోని టేబుల్ కింద మైక్ ని సెట్ చేయిస్తాడు. ఎంత సేపు సెట్ చేస్తావ్ వాళ్ళు వస్తారంటూ సెట్ చేసే పర్సన్ పై చిరాకుపడుతుంటాడు. సర్ అయిపోయిందని అతను అనగానే.. అసలు వర్క్ చేస్తుందా అని శైలేంద్ర అతన్ని అడుగుతాడు. నా వర్క్ పైనే డౌట్ పడుతారా అని అతను మీరు దూరం వెళ్లి ఇది పెట్టుకొని వినండి.. ఇక్కడ నేను మాట్లాడుతానని శైలేంద్రని బయటకు పంపిస్తాడు.

ఆ తర్వాత తనపై తన వర్క్ పై చిరాకు పడతాడా అంటూ అతను కోపంగా శైలేంద్రని ఇష్టం మొచ్చినట్లు తిడతాడు. అది విని కోపంగా శైలేంద్ర వస్తాడు.. మీరు ఇలాంటివి వినడానికే కదా అంటూ డబ్బులు అడుగుతాడు.. శైలేంద్ర ఏం చెయ్యలేక డబ్బులు ఇచ్చి పంపిస్తాడు... ఆ తర్వాత మహేంద్ర వసుధారలు ఆఫీస్ కి వస్తారు. ఏంటి మావయ్య ఫైల్స్ అంతా చిందర వందరగా ఉన్నాయని అంటుంది. ఆ తర్వాత రిషి ఫోటో చూస్తూ మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. రిషి ఫోటో కింద పడిపోతుంది. అది తీస్తుంటే టేబుల్ కింద ఉన్న మైక్ ని చూస్తాడు మహేంద్ర. ఆ విషయం వసుధారకి చెప్తాడు. మన మాటలు శైలంద్ర వింటున్నాడు అని మహేంద్ర పేపర్ రాసి చూపిస్తాడు. ఆ తర్వాత ఇక వసుధార, మహేంద్రలు తమ మాటలు శైలేంద్ర వింటున్నాడని తెలిసి.. కావాలనే మనుని తిట్టినట్టు యాక్ట్ చేస్తుంటారు. నాకు ఎందుకో శైలేంద్రపై నమ్మకం కలుగుతుంది. వాడు ఇప్పటివరకు ఎన్ని తప్పులు చేసిన మను విషయంలో కాలేజీ విషయంలో మనకు హెల్ప్ చేస్తాడనిపిస్తుందని మహేంద్ర అంటాడు. నాకు అలా అనిపించడం లేదని వసుధార అంటుంది.

ఆ తర్వాత వాళ్ళ మాటలు విని శైలేంద్ర బాబాయ్ కి ఇప్పుడిప్పుడే నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు నేను వెళ్లి మంచిగా మాట్లాడాలని అనుకొని వాళ్ళ క్యాబిన్ కి వెళ్తాడు. నేను కాలేజీ విషయం లో హెల్ప్ చేస్తాను.. మనుని బయటకు తీసుకొని వస్తాను కానీ మీరు ఒక కండిషన్ కి ఒప్పుకువాలని చెప్తాడు. మరొకవైపు శైలేంద్ర ఇంకా ఫోన్ చెయ్యడం లేదు.. నేను ఫోన్ చేస్తే కోపానికి వస్తాడని రాజీవ్ అనుకుంటాడు. వసుధార మహేంద్ర, శైలేంద్ర కలిసి మనుని కలుస్తారు. ఇప్పుడు ఇక్కడికి ఈ మను దగ్గరికి ఎందుకు తీసుకొని వచ్చావని శైలేంద్రని మహేంద్ర అడుగుతాడు. అగ్రిమెంట్ పేపర్స చూపిస్తూ.. ఇప్పుడు నేను చెప్పేది కొంచెం షాకింగ్ గా అనిపించొచ్చని శైలేంద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.