Read more!

English | Telugu

Guppedantha Manasu : రాజీవ్ చనిపోయాడా.. అసలేం జరిగింది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1062 లో.. మను అందరికి ఆ రోజు ఏం జరిగిందని మొత్తం చెప్తాడు. నేను బుల్లెట్ మిస్ ఫైర్ చేసాను.. ఆ తర్వాత రాజీవ్ కి వార్నింగ్ ఇచ్చానని మను చెప్తాడు. అది విన్న ఇన్‌స్పెక్టర్.. ఇక చాలు.. కథలు బానే అల్లుతున్నావని అంటాడు. మీరే రాజీవ్ ని చంపారని అంటున్నారు కదా.. మరి రాజీవ్ బాడీ ఎక్కడ అని వసుధార అడగుతుంది. చంపినోడు బాడీని మాయం చెయ్యలేడా అని ఇన్‌స్పెక్టర్ అంటాడు. బాడీ రేకవరీ చేసాక.. ఇంకా పక్క ఆధారాలు ఉంటాయి.. బుల్లెట్ లు దొరుకుతాయని ఇన్‌స్పెక్టర్ అంటాడు.

ఆ తర్వాత అనుపమ మేడమ్ గారు రాలేదా అని మను అడుగుతాడు. తను నీ గురించి చాలా బాధపడుతుంది. నిన్ను ఇలా చూడలేక బయటే ఉందని మహేంద్ర చెప్తాడు. తనతో వెళ్లి మాట్లాడొస్తానని అనుపమ దగ్గరికి మహేంద్ర వెళ్తాడు. మరొకవైపు అసలు రాజీవ్ చనిపోవడమేంటి? నమ్మలేకపోతున్నా ఎంత ప్రేమగా పిలిచేవావాడని శైలేంద్రతో దేవయాని అంటుంది. నాకు నమ్మిన బంటు లాగా ఉండేవాడు.. ఏది చెప్పినా వినేవాడు ఒక గ్రూప్ గా ఉండేవాళ్ళం.. నిజంగానే రాజీవ్ చనిపోయాడా అని దేవయాని అడుగుతుంది... అది నిజమే కదా అందుకే మను ని అరెస్ట్ చేసింది అని శైలంద్ర అంటాడు.. నీకేం బాధ లేదా అని దేవాయని అడుగుతుంది.. నాకేం బాధ లేదు అలాంటి ఎమోషన్స్ నాకు ఉండవని శైలేంద్ర అంటాడు. కొంపదీసి అందులో నీ హస్తం ఉందా అని శైలేంద్రతో దేవయాని అడుగుతుంది. నన్నే అనుమానిస్తున్నావా అని శైలేంద్ర అంటాడు. అలా కాదు కానీ వాడు పెద్ద జాదుగాడు రిషిని బయపెట్టిన వాడు మను చేతిలో చావడం ఏంటని దేవయాని అంటుంది. అదంతా ఏం ఆలోచించకు మనకి లైన్ క్లియర్ అయింది.. గమ్యం ఎలా చేరాలో ఆలోచించని శైలేంద్ర అంటాడు.

మరొకవైపు అనుపమ బాధపడుతుంటే మహేంద్ర వచ్చి.. దైర్యం చెప్తాడు. అప్పుడే ఏంజిల్ వస్తుంది.. అసలు నువ్వు ఎందుకు అలా చేసావ్ ? కోపాన్ని కంట్రోల్ చేసుకోలేవా అంటూ మనుని అడుగుతుంది.. ఆ తర్వాత ఏంజిల్ కి వసుధార జరిగిందంతా చెప్తుంది. రాజీవ్ ని చంపావా లేదా అని మనుని ఏంజిల్ అడుగుతుంది. లేదని మను చెప్పాగానే.. నిన్ను నేను నమ్ముతున్నాను.. ఎలాగైనా బయటక వస్తావని ఏంజిల్ అంటుంది.. అపుడే ఇన్‌స్పెక్టర్ వచ్చి రాజీవ్ బాడీ దొరికిందనగానే అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత మను ఏ తప్పు చెయ్యలేదు.. నిర్ధోషిగా బయటకు వస్తాడు.... నేను తాతయ్యకి చెప్పి లాయర్ తో మాట్లాడమని చెప్తానని ఏంజిల్ అంటుంది.‌ వద్దు నాన్నకి ఈ విషయం చెప్పకని అనుపమ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.