Read more!

English | Telugu

Guppedantha Manasu : పోలీస్ స్టేషన్ లో కొడుకు.. ఇంట్రస్టింగ్ గా ఇంటరాగేషన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1061 లో... మనుని మహేంద్ర దత్తత తీసుకుంటుండగా పోలీసులు వచ్చి తీసుకెళ్తారు. ఇక ఇంట్లో వాళ్ళంతా షాక్ అవుతారు. కేసుని పక్కద్రోవ పట్టించడానికే మను ఇక్కడికి వచ్చాడు. నిన్నటి వరకు దత్తత కార్యక్రమానికి రానని చెప్పి ఇప్పుడు ఎందుకు వచ్చాడు.. డైవర్ట్ చెయ్యడానికే కదా అని దేవయాని అంటుంది. అలా ఎందుకు అనుకుంటారు మనసు మార్చుకొని ఇలా వచ్చి ఉండొచ్చు కదా అని వసుధార అంటుంది.

ఆ తర్వాత దేవయాని వాళ్ళని ఫణీంద్ర ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడు. మరొకవైపు మనుని విడిపించడానికి మహేంద్ర వాళ్ళు వెళ్తారు. ఆ తర్వాత మను ఇలా చేశాడంటే నేను నమ్మలేకపోతున్నానని.. అసలు రాజీవ్ ని మను షూట్ చెయ్యడం ఏంటని ఫణీంద్ర అంటాడు. అసలు వాళ్లకి పరిచయం ఎక్కడిది? షూట్ చెయ్యాలిసిన అవసరం ఏముందని శైలేంద్ర అంటాడు. ఆ మను ప్లాన్ ప్రకారమే ఇదంతా చేశాడని దేవయాని అనగా.. ఫణీంద్ర తనని తిడతాడు.... మీరు ఇలా ఉండబట్టే మిమ్మల్ని మహేంద్రని బుట్టలో పడేసుకుంటున్నారని దేవయాని అంటుంది. మరొక మవైపు పోలీస్ స్టేషన్ కి ముగ్గురు వెళ్తారు. నేను లోపలికి రాలేను.. వాణ్ణి ఫేస్ చెయ్యలేను.. పోలీస్ లు తీసుకొని వెళ్తుంటే చూడలేకపోయాను.. ఇప్పుడు స్టేషన్ లో వాన్ని అలా చూడలేనని అనుపమ అంటుంది. ఆ తర్వాత వసుధార, మహేంద్ర ఇద్దరు లోపలికి మను దగ్గరికి వెళ్తారు.

నువ్వు నిజంగానే రాజీవ్ ని కాల్చావా అని మహేంద్ర అడుగుతాడు. వాణ్ణి కలిసిన మాట నిజమే కానీ షూట్ చెయ్యలేదని మను చెప్తాడు. అప్పుడే ఇన్‌స్పెక్టర్ వచ్చి.. నువ్వు చేసావనడానికి నా దగ్గర వీడియో ఉంది అంటూ చూపిస్తాడు. అందులో రాజీవ్ కి బుల్లెట్ తాకినట్టు ఎక్కడ ఉందని మను అంటాడు. అదంతా ఎడిటింగ్ అని వసుధార అంటుంది. ఆ తర్వాత అది చుసిన ప్రత్యక్ష సాక్షి కూడ ఉన్నారని మను పీఏని ఇన్‌స్పెక్టర్ పిలుస్తాడు. సర్ కాల్చడం చూసానని పీఏ అనగానే అందరు షాక్ అవుతారు.. అతను కూడా షూట్ చేసానని చెప్పాడు కానీ బుల్లెట్ రాజీవ్ కి తగిలిందని చెప్పలేదు కదా అని మను అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.