Read more!

English | Telugu

Guppedantha Manasu: మను ఎమోషన్స్ తో ఆడుకుంటున్న రాజీవ్.. అతనికి తండ్రి జాడ తెలిసేనా!



స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1059 లో....అనుపమ ఒక్కసారిగా నిద్రలో నుండి లేచి అరుస్తుంది. దాంతో ఏమైందని వసుధార వస్తుంది. పీడకల వచ్చింది. మహేంద్రని మను షూట్ చేసినట్టు కల వచ్చింది..మా పెద్దమ్మ నీకు నిజం చెప్పినప్పటి నుండి నాకు భయంగా ఉందని వసుధారతో అనుపమ అంటుంది. మను తండ్రి మహేంద్ర అని నువ్వు నిజం చెప్పినట్టు.. దాంతో మహేంద్రని మను షూట్ చేసినట్టు కల వచ్చిందని అనుపమ అంటుంది.

మనుకి నిజం చెప్పకు.. ఎందుకంటే  మనుకి తన తండ్రి అంటే ఎంత కోపమో తెలుసు కదా అని అనుపమ అంటుంది. మరొకవైపు మనుకి వసుధార ఫోన్ చేస్తుంది కానీ మను లిఫ్ట్ చెయ్యడు. ఆ తర్వాత మనుకి వేరొక నెంబర్ నుండి ఫోన్ వస్తుంది. అది రాజీవ్... మీ నాన్న ఎవరో నాకు తెలుసని రాజీవ్ అనగానే.. శైలేంద్ర నువ్వే నాకు తెలుసు అని మను అంటాడు.. శైలేంద్ర ఎవరు.. నేను శైలేంద్ర ని కాదు నేను చెప్పిన ప్లేస్ కి వస్తే.. మీ నాన్న ఎవరో తెలుస్తుందని అనగానే.. సరే వస్తున్నానని మను బయల్దేరి వెళ్తాడు.. అక్కడ మహేంద్ర ఫేస్ మాస్క్ తో రాజీవ్ వచ్చి.. నాన్న కోసం వచ్చావా నాయనా అంటాడు. చూడు ఇతనే మీ నాన్న అని మహేంద్ర ఫేస్ మాస్క్ ని చూపిస్తాడు. అదే నిన్ను దత్తత తీసుకుంటున్నాడు కదా అందుకే అని రాజీవ్ చెప్తూ.. తన ఫేస్ మాస్క్ ని తీస్తాడు.. ఒరేయ్ రాజీవ్.. నా ఎమోషన్స్ తో ఆడుకుంటావా అని మను అంటాడు. మరి నువ్వు కూడా వసు విషయంలో నా ఎమోషన్స్ తో ఆడుకుంటున్నావ్ కదా అని రాజీవ్ అంటాడు. ఇక ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. మను గన్ తీసి రాజీవ్ ని షూట్ చేస్తాడు.

మరోకవైపు అనుపమ ఫోన్ తీసుకొని మనుకి వసుధార కాల్ చేస్తుంది. మను లిఫ్ట్ చేస్తాడు. నువు రేపు వస్తే నీకు మీ నాన్న గురించి తెలిసే అవకాశం ఉందని వసుధార అంటుంది. ఇందుకు అనుపమ మేడమ్ ఒప్పుకున్నారా అని మను అడుగుతాడు. ఒప్పుకున్నానని అనుపమ అనగానే.. మను షాక్ అయ్యి ఫోన్ కట్ చేస్తాడు మరొకవైపు ఇంకా రెడీ అవ్వలేదా అంటు దేవయానిని ఫణింద్ర అడుగుతాడు. నేను రావట్లేదని దేవయాని అంటుంది. ఆ తర్వాత వస్తున్నామని శైలేంద్ర చెప్తాడు. దాంతో దేవయాని ఆశ్చర్యంగా చూస్తుంది. రెడీ అవ్వు అంటూ ధరణిని లోపలికి పంపిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.