Read more!

English | Telugu

Guppedantha Manasu : అనుపమ కొడుకుని మహేంద్ర దత్తత తీసుకుంటాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1053 లో.. కాలేజీలో బోర్డు మీటింగ్ ఏర్పాటు చేస్తారు. మొన్న పేరెంట్స్ , లెక్చరర్ మీటింగ్ అంటే సక్సెస్ కాలేదని బోర్డు మెంబర్స్ అంటారు. మళ్ళీ మీటింగ్ పెట్టుకోవచ్చు కదా దానికి ఎందుకు అంతలా ఫీల్ అవ్వడమని మహేంద్ర అంటాడు. అలా అంటారేంటి సర్ మీరు.. అలా చెప్పడం వల్ల కాలేజీ పరువు ఏమవుతుందని బోర్డు మెంబర్స్ అంటారు.

ఆ తర్వాత నేను కరెక్ట్ గానే మాట్లాడానని మహేంద్ర వెటకారంగా మాట్లాడతాడు. జరిగిన గొడవ గురించి చాలా చీప్ గా మాట్లాడుతున్నారని బోర్డు మెంబర్స్ అంటారు. అయిన మను గారి గురించి అడిగితే మీరు ఎందుకు రియాక్ట్ అయ్యారని వాళ్ళు అడుగుతారు. ఆ సిచువేషన్ లో మా బాబాయ్ స్పందించాడని శైలేంద్ర అంటాడు.‌ మహేంద్ర గారు చెప్పిన దాంట్లో నిజం ఉండొచ్చా? అబద్దం ఉండొచ్చు అని వాళ్ళు అంటారు. అంటే మా బాబాయ్ తప్పు చేశాడని అంటున్నారా అని శైలేంద్ర అంటాడు. అందుకే మిషన్ ఎడ్యుకేషన్ ఇంచార్జీగా అనుపమని పెట్టారు.. ఆ రోజు మహేంద్ర గారు చేసింది తప్పని బోర్డు మెంబర్స్ అంటారు. అవును మహేంద్ర.. నువ్వు అలా మాట్లాడి ఉండాలిసింది కాదని ఫణీంద్ర అనగానే.. సరే నేను తప్పు చేసాను అంటున్నారు కదా కాలేజీ నుండి వైదోలగిపోతానని మహేంద్ర అంటాడు. అప్పుడే మను వచ్చి.. నా వల్లే ఇదంతా నేనే వెళ్ళిపోతానని అంటాడు. తను ఎక్కడికి వెళ్ళడు ఇక్కడే ఉంటాడు. కాలేజీకి యాబై కోట్ల అప్పు ఇచ్చాడు. అది కట్టకుండా అతన్ని పంపించలేరని మహేంద్ర అంటాడు.

ఆ తర్వాత వసుధార ఇంటికి వచ్చాక.. మీరు అలా కాలేజీకి రానని చెప్పడం కరెక్ట్ కాదని మహేంద్రతో అంటుంది.‌ అసలు ఎందుకు మా విషయం లో ఎమోషనల్ గా ఇన్వాల్వ్ అవుతున్నావని అనుపమ అంటుంది. నువ్వు కూడ మా విషయంలో అలాగే ఇన్వాల్వ్ అయ్యావ్ కదా.. ఈ విషయానికి పరిష్కారం ఆలోచిస్తున్నానని మనుని దత్తత తీసుకుంటున్నానని మహేంద్ర అనగానే.. వసుధార, అనుపమ లు షాక్ అవుతారు. ఆ తర్వాత అనుపమకి దేవయాని ఫోన్ చేసి.. నా మరిది మీ వల్లే కాలేజీకి వెళ్లొద్దని అనుకుంటున్నాడని తిడుతుంది. మహేంద్ర ఫోన్ తీసుకొని.. నేను మీ ఇంటికి ఇన్విటేషన్ ఇవ్వడానికి వస్తున్నాను.. వచ్చాక మాట్లాడుకుందాం వదిన అని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత మీ తమ్ముడు ఏదో ఇన్విటేషన్ ఇవ్వడానికి వస్తున్నాడంట అని ఫణీంద్రతో దేవయాని చెప్తుంది. దేనిగురించి అని అందరు ఆలోచిస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే