Read more!

English | Telugu

Guppedantha Manasu : సెక్యూరిటీ గెటప్ లో శైలేంద్ర.. ఇద్దరు కలిసి ఆడేసుకున్నారు కదా!

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' గుప్పెడంత మనసు'.  ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-1047  లో..  మను కాలేజ్‌ నుంచి వెళ్లిపోయాడు కాబట్టి నువ్వే వెళ్లి మనుని తీసుకుని రమ్మని శైలేంద్రతో ఫణీంద్ర చెప్తాడు. దీంతో చచ్చినట్టు మను దగ్గరకు వెళ్లిన శైలేంద్ర.. కాలేజ్‌కి రమ్మని బ్రతిమిలాడతాడు. బోర్డాఫ్ డైరెక్టర్‌గా నేను తీసుకున్న పోస్టే కదా.. అందుకే రిజైన్ చేస్తున్నానని మను అంటాడు.  బాబు అంత మాట అనొద్దు ప్లీజ్.. అక్కడ వర్క్ ఆగిపోతుంది. మీ సంతకం లేక ఫైల్స్ పెండింగ్‌లో ఉండిపోతున్నాయని శైలేంద్ర అంటాడు. నువ్వే కదా నన్ను కాలేజ్ నుంచి బయటకు పంపాలని చూస్తున్నావ్.. నువ్వెందుకు నన్ను రావాలని పట్టుపడుతున్నావని మను అడుగుతాడు. ఏం చేస్తాం బ్రదర్.. పరిస్థితి బాలేకపోతే అరటిపండు తిన్నా పన్ను విరుగుతుంది.. నా పరిస్థితి కూడా అంతే అని శైలేంద్ర అంటాడు. నువ్వు అరటిపండు తింటావో.. లేదంటే గన్నేరుపప్పు తింటావో నీ ఇష్టం.. నేను మాత్రం కాలేజ్‌కి రానని‌ మను అంటాడు. మీరు కాలేజీకీ రాకపోతే మా డాడీ నన్ను చంపినా చంపేస్తారని శైలేంద్ర అనగానే.. అయితే చచ్చిపో.. నువ్వు చస్తే నాకెందుకని మను అంటాడు. ఇక మను కాళ్లపై పడతాడు శైలేంద్ర. ప్లీజ్ మీరు అలా అనొద్దు.. ఖచ్చితంగా మీరు కాలేజ్‌కి రావాలి.. మీ జోలికి రాను.. మీరు కాలేజ్‌కి రావాల్సిందే.. వస్తానని అనేవరకూ నేను ఇలాగే ఉండిపోతానని మను కాళ్లని పట్టుకునే ఉంటాడు శైలేంద్ర. 

ఏమండీ నా కాళ్లు వదలండి అని ధరణి గొంతు వినిపిస్తుంది. ఇదేంటి నా భార్య ధరణి వాయిస్ వినిపిస్తుందని శైలేంద్ర మెల్లగా కళ్లు తెరుస్తాడు. అంటే ఇప్పటివరకూ జరిగింది మొత్తం కలా.. మను కాళ్లపై పడ్డట్టు కలకంటాడు శైలేంద్ర. కానీ ఎదురుగా ధరణిని చూసేసరికి.. ఛీఛీ ఈ మధ్య నేను పగటి కలలు ఎక్కువ కంటున్నానని తనని తాను తిట్టుకుంటాడు. ఏంటండీ.. ఏమైందండీ.. నా కాళ్లు పట్టుకుని బ్రతిమిలాడుతున్నారంటు శైలేంద్రపై ధరణి మండిపడుతుంది. కాసేపటికి మనుకి శైలేంద్ర ఫోన్ చేస్తాడు. మను కావాలనే కట్ చేస్తాడు. మళ్లీమళ్లీ శైలేంద్ర ఫోన్ చేయడంతో.. లిఫ్ట్ చేస్తాడు. ఏంటి బ్రదర్.. లంచ్ అయ్యిందా అని శైలేంద్ర అనగానే.. . ఏయ్ విషయం ఏంటో చెప్పు.. సోది మాట్లాడకని మను ఫోన్ పెట్టేస్తాడు. దాంతో మళ్లీ ఫోన్ చేసిన శైలేంద్ర.. ఏం లేదు బ్రదర్.. మీరు కాలేజ్‌కి రావాలని చెప్తాడు. ఎందుకు ఇంతలా అడుగుతున్నావ్.. నేను రాకపోతే ఏమౌతుందని మను అగడంతో.. మను రాకపోతే గేటు దగ్గర సెక్యురిటీ బాయ్‌లా ఉండాల్సి వస్తుందని ఫణీంద్ర అన్నమాటల్ని శైలేంద్ర గుర్తుచేసుకుంటాడు. నేను మాట్లాడిన మాటల వల్లే హర్ట్ అయ్యారు కదా.. మీరు రాకపోతే గిల్టీగా ఉంది.. పశ్చాత్తాపంతోనే ఫీల్ అయిపోతున్నా.. మీకు క్షమాపణ కూడా చెప్తాను.. ప్లీజ్ రండి బ్రదర్.. సారీ సారీ.. మీరు దగ్గర లేరు.. కాళ్లు పట్టుకుంటాను.. కావాలంటే మీ కాళ్లు ఫొటో తీసి పెట్టండి.. కాళ్లు పట్టుకుంటానని శైలేంద్ర అంటాడు. మీరేం చేసినా సరే నేను రానంటే నానని మను ఫోన్ పెట్టేస్తాడు. 

మరోవైపు అనుపమని చూడ్డానికి విశ్వం వస్తాడు. చూడమ్మా.. నువ్వు ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు.. ఏ పరిస్థితులోనైనా ఈ నాన్న నీకు తోడుగా ఉంటాడని మర్చిపోకని ధైర్యం చెప్పి వెళ్తాడు. ఇక శైలేంద్ర కాలేజ్ గేటు దగ్గరే ఉండి.. ఈ మను గాడ్ని ఎంత అడిగినా రానంటున్నాడు. ఇఫ్పుడు నా పరిస్థితి ఏంటని ఆలోచిస్తుంటాడు. ఇంతలో వసుధార ఫోన్ చేసి రమ్మని చెప్పగా.. మొదట రానని చెప్పినా ఆ తర్వాత వస్తాడు. లోపలికి వచ్చేటప్పుడు పర్మిషన్ అడిగి రావాలని తెలియదా అని వసుధార అంటుంది‌. నువ్వే కదా రమ్మని కాల్ చేసింది.. అడిగిరావాలని నాకు తెలియదులే అని శైలేంద్ర అంటాడు.  ఇప్పుడు తెలిసింది కదా.. వెళ్లి పర్మిషన్ అడిగిరండి అని వసుధార అంటుంది. తప్పదా అని శైలేంద్ర అంటే.. తప్పదని  వసుధార అంటుంది. దాంతో శైలేంద్ర.. చచ్చినట్టు మళ్లీ గుమ్మం దగ్గరకు వెళ్లి.. నేను లోపలికి రావొచ్చా అని అడుగుతాడు. అప్పుడు వసుధార ఇగో సంతృప్తి చెంది.. లోపలికి రండి అని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.